గోపికల విరహ వేధన:
పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు
రచన : రామకృష్ణ దువ్వు
స్వరకల్పన : దుర్గారావు పిచ్చిక,
గానం : మూల శ్రీలత,
ఆల్బం : బృందావనం
రికార్డింగ్ : శ్రీ మాత రికార్డింగ్, విశాఖపట్నం
నిర్మాతలు : RKSS క్రియేషన్స్
పల్లవి:
పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు
కన్నయ్యా తెంచేసి వెళ్ళి పోయావా…
పున్నమి రాతిరిలో వెన్నెల వెలుతురు లో
వెన్నదొంగ పిల్లనగ్రోవి ఊదకున్నావే…
చరణం 1:
ఆలమందల గిట్టల సవ్వడి మా చెవిలో పడగానే
తనువంతా పులకించి నీ కోసం ఎదురొస్తే
ఆలమందల గిట్టల సవ్వడి మా చెవిలో పడగానే
తనువంతా పులకించి నీ కోసం ఎదురొస్తే
నువు లేక మా కళ్ళ జారాయి కన్నీళ్ళు..
రేగిన గోధూళికి కళ్ళాపి జల్లాయి…
నువు లేక మా కళ్ళ జారాయి కన్నీళ్ళు..
రేగిన గోధూళికి కళ్ళాపి జల్లాయి…
చరణం 2:
చల్లను చిలికి వెన్నను తీసి వెన్నునికై
చూడగా
మన్నుతిన్న నోటికి చేరలేక కరిగిపోతే…
చల్లను చిలికి వెన్నను తీసి వెన్నునికై
చూడగా
మన్నుతిన్న నోటికి చేరలేక కరిగిపోతే…
కనుపాపలందు దాగిన నీరూపమే
జలపాతమై ఉరికె మా కన్నీరుగా…
కనుపాపలందు దాగిన నీరూపమే
జలపాతమై ఉరికె మా కన్నీరుగా…
చరణం 3:
వెదురగడను మురళిగా మలచేవు నీవు
కమ్మనైన రాగాలు ఇంపుగా తీసేవు..
వెదురగడను మురళిగా మలచేవు నీవు
కమ్మనైన రాగాలు ఇంపుగా తీసేవు..
మనసు ఇచ్చిన ఈ మగువల విడిచేవు
ప్రాణమే లేనట్టి శిలలు గా చేసావు…
మనసు ఇచ్చిన ఈ మగువల విడిచేవు
ప్రాణమే లేనట్టి శిలలు గా చేసావు…
పొన్నచెట్టు నీడలో పెంచుకున్న ఆశలు
కన్నయ్యా తెంచేసి వెళ్ళి పోయావా…
- రామకృష్ణ దువ్వు -
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి