ముందు వెనకా వేటగాళ్లు
చిత్రం : బంగారు చెల్లెలు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
ముందు వెనకా వేటగాళ్లు...
ముద్దులాడే జంట లేళ్లు
ప్రేమా.. ఎంత ప్రేమా...
అమ్మమ్మ.. ఏదమ్మా...
కొండకోన పొదరిల్లు..
గుండెలోనా పడకటిల్లు
ప్రేమా.. అదే ప్రేమా
అమ్మమ్మా.. ఔనమ్మా
చరణం 1 :
అడవి గాలిలా నన్ను కమ్ముకో.. ఉమ్మ్
అయోద్య రాముడల్లే ఆదుకో..
బంగారు లేడి నిన్ను అడగను పో..
శృంగార రామూడివై ఏలుకో...
నా అందాల ఏలికవై ఉండిపో..
ముందు వెనకా వేటగాళ్లు...
ముద్దులాడే జంట లేళ్లు
ప్రేమా.. ఎంత ప్రేమా...
అమ్మమ్మా.. ఔనమ్మా
చరణం 2 :
ఆ...ఆ.. ఆ... ఆ...
ఆ.. ఆ.. ఆ.. ఆ..
అహ.. హా..
నీలాల నీ కురుల దుప్పటిలో...
సిరిమల్లెపూల చిలిపి అల్లరిలో
నీ వయసు మెరిసింది కన్నులలో..
నా మనసు ఉరిమింది చూపులలో
నే కరగాలి నీ కన్నే కౌగిలిలో...
అమ్మమ్మ..ఏదమ్మా...
కొండకోన పొదరిల్లు..
గుండెలోనా పడకటిల్లు
ప్రేమా.. అదే ప్రేమా
అమ్మమ్మా.. ఏదమ్మా
చరణం 3:
నా గుండెలో నీ తల దాచుకో
నా ఎండలో నీ చలి కాచుకో..
నా వన్నెచిన్నెలన్నీ పంచుకో..
నన్నింక నీలోనే పంచుకో...
ఈ గురుతునే బ్రతుకంతా ఉంచుకో
అమ్మమ్మా.. ఔనమ్మా
ముందు వెనకా వేటగాళ్లు...
ముద్దులాడే జంట లేళ్లు
ప్రేమా.. అదే ప్రేమా...
అమ్మమ్మ..ఏదమ్మా...
అమ్మమ్మ..ఏదమ్మా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి