సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది
చిత్రం : మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : ఘంటసాల
పల్లవి :
సిరిపల్లె చిన్నది... చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే... చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో... ఓ.. భయమేస్తున్నదీ
సిరిపల్లె చిన్నది... చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే... చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో... ఓ.. భయమేస్తున్నదీ
చరణం 1 :
మొన్న మొన్న ఈ పల్లెటూరిలో పుట్టిన బుజ్జాయి
చొ..ఊ..ఊ..ఊ..ఊ..ఆయీ
మొన్న మొన్న ఈ పల్లెటూరిలో పుట్టిన బుజ్జాయి
నిన్నటిదాకా పరికిణి కట్టి తిరిగిన పాపాయి
బస్తీ మకాము పెట్టి... బడాయి నేర్చుక వచ్చి
బస్తీ మకాము పెట్టి... బడాయి నేర్చుక వచ్చి
బుట్టబొమ్మలా గౌను వేసుకొని
ఫోజులు కొడుతూ ఉన్నది
సిరిపల్లె చిన్నది...చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే...చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో..ఓ... భయమేస్తున్నదీ
చరణం 2 :
ఇప్పుడిప్పుడే లండను నుండి దిగింది దొరసాని...
"SHUT UP"
వచ్చీ రానీ ఇంగిలీసులో దంచుతోంది రాణి...
YOU IDIOT...
బాసపీసు రేగిందంటే... ఒళ్ళు పంబరేగేనండి
బాసపీసు రేగిందంటే... ఒళ్ళు పంబరేగేనండి
అబ్బ తాచుపాములా...
పడగ విప్పుకొని తై తై మన్నది
సిరిపల్లె చిన్నది...చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే...చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ
చరణం 3 :
సిగ్గే తెలియని చిలిపి కళ్ళకు
నల్లని అద్దాలెందుకు
తేనెలు చిలికే తెలుగు ఉండగా
ఇంగిలీసు మోజెందుకు
ఓయబ్బో ఇంగిలీసు దొరసాని...
నోరు మంచిదైనప్పుడు...
ఊరు మంచిదే ఎప్పుడు
నోరు మంచిదైనప్పుడు..
ఊరు మంచిదే ఎప్పుడు
తెలుసుకోలేని బుల్లెమ్మలకు...
తప్పవులే తిప్పలు
హేయ్..సిరిపల్లె చిన్నది...
చిందులు వేస్తున్నది
చిన్నగాలి తాకిడికే...
చిర్రుబుర్రుమన్నది
ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి