RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
manchi rojulu vachayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
manchi rojulu vachayi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, జనవరి 2023, శనివారం

ఈనాటి సంక్రాంతి అసలైన పండగ | Eenati Sankranthi | Song Lyrics | Manchirojulu Vachayi (1972)

ఈనాటి సంక్రాంతి



చిత్రం :  మంచిరోజులు వచ్చాయి (1972)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  ఘంటసాల 



పల్లవి :


ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ..ఆ... ఆ... ఆ

బీదసాదలకెల్ల ప్రియమైన పండగ..ఆ.. ఆ... ఆ 


ఈనాటి సంక్రాంతి...  

అసలైన పండగ సిసలైన పండగ

కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...  

అది కన్నుల పండగ

ఈనాటి సంక్రాంతి 

అసలైన పండగ సిసలైన పండగ

కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...  

అది కన్నుల పండగ


ఎవ్వరేమి అనుకున్నా... 

ఎంతమంది కాదన్నా

ఎవ్వరేమి అనుకున్నా..

ఆ..ఎంతమంది కాదన్నా

ఉన్నవాళ్ళ పెత్తనం...  ఊడుతుందిలే..

సోషలిజం వచ్చే రోజు... దగ్గరుందిలే..


ఈనాటి సంక్రాంతి అసలైన పండగ...  

సిసలైన పండగ

కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...  

అది కన్నుల పండగ



చరణం 1 :


గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే..

ఆ..ఆ..ఆ..ఆ

ఈ కారులు మేడలు కొద్దిమందికే స్థిరము కావులే..

ఆ..ఆ..ఆ..ఆ

గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే

ఈ కారులు మేడలు కొద్దిమందికే స్థిరము కావులే


ఓడలు బండ్లై... ఓ.. ఓ.. ఓ ఓహోయ్..

బండ్లు ఓడలై..ఆ..ఆ..ఆ

ఓడలు బండ్లై... బండ్లు ఓడలై

తారుమారు ఎప్పుడైనా...  

తప్పదులే తప్పదులే


ఈనాటి సంక్రాంతి అసలైన పండగ...  

సిసలైన పండగ

కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...   

అది కన్నుల పండగ



చరణం 2 :


ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమైపోతారు...  

ఏమైపోతారు..ఆహా హా హా

పిల్లుల్లాగా తొక ముడుచుకొని... 

మ్యావ్ మ్యావ్ మంటారు

కిక్కురుమనక..ఆ..ఆ..ఆ..ఆ... 

కుక్కిన పేనై..ఆ..ఆ..ఆ..ఆ

కిక్కురుమనక కుక్కిన పేనై...  

చాటుగా నక్కుతారు...  

చల్లగా జారుకుంటారు


ఈనాటి సంక్రాంతి 

అసలైన పండగ సిసలైన పండగ

కష్టజీవులకు అది 

ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ


ఎవ్వరేమి అనుకున్నా...ఎంతమంది కాదన్న

ఎవ్వరేమి అనుకున్నా...ఎంతమంది కాదన్న

ఉన్నవాళ్ళ పెత్తనం...  ఊడుతుందిలే

సోషలిజం వచ్చే రోజు దగ్గరుందిలే


ఈనాటి సంక్రాంతి అసలైన పండగ...  

సిసలైన పండగ

కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...   

అది కన్నుల పండగ


పాటల ధనుస్సు 

19, అక్టోబర్ 2022, బుధవారం

సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది | Siripalle Chinnadi | Song Lyrics | Manchi Rojulu Vachayi (1972)

సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది



చిత్రం :  మంచిరోజులు వచ్చాయి (1972)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  ఘంటసాల 



పల్లవి :


సిరిపల్లె చిన్నది...  చిందులు వేస్తున్నది

చిన్నగాలి తాకిడికే...  చిర్రుబుర్రుమన్నది

ఓయమ్మో... ఓ.. భయమేస్తున్నదీ  


సిరిపల్లె చిన్నది...  చిందులు వేస్తున్నది

చిన్నగాలి తాకిడికే...  చిర్రుబుర్రుమన్నది

ఓయమ్మో... ఓ.. భయమేస్తున్నదీ



చరణం 1 :


మొన్న మొన్న ఈ పల్లెటూరిలో పుట్టిన బుజ్జాయి

చొ..ఊ..ఊ..ఊ..ఊ..ఆయీ 

మొన్న మొన్న ఈ పల్లెటూరిలో పుట్టిన బుజ్జాయి

నిన్నటిదాకా పరికిణి కట్టి  తిరిగిన పాపాయి

బస్తీ మకాము పెట్టి... బడాయి నేర్చుక వచ్చి

బస్తీ మకాము పెట్టి... బడాయి నేర్చుక వచ్చి

బుట్టబొమ్మలా గౌను వేసుకొని 

ఫోజులు కొడుతూ ఉన్నది 


సిరిపల్లె చిన్నది...చిందులు వేస్తున్నది

చిన్నగాలి తాకిడికే...చిర్రుబుర్రుమన్నది

ఓయమ్మో..ఓ... భయమేస్తున్నదీ 



చరణం 2 :


ఇప్పుడిప్పుడే లండను నుండి దిగింది దొరసాని... 

"SHUT UP"

వచ్చీ రానీ ఇంగిలీసులో దంచుతోంది రాణి...  

YOU IDIOT...

బాసపీసు రేగిందంటే... ఒళ్ళు పంబరేగేనండి

బాసపీసు రేగిందంటే... ఒళ్ళు పంబరేగేనండి

అబ్బ తాచుపాములా... 

పడగ విప్పుకొని తై తై మన్నది 


సిరిపల్లె చిన్నది...చిందులు వేస్తున్నది

చిన్నగాలి తాకిడికే...చిర్రుబుర్రుమన్నది

ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ  



చరణం 3 :


సిగ్గే తెలియని చిలిపి కళ్ళకు 

నల్లని అద్దాలెందుకు

తేనెలు చిలికే తెలుగు ఉండగా 

ఇంగిలీసు మోజెందుకు

ఓయబ్బో ఇంగిలీసు దొరసాని...

నోరు మంచిదైనప్పుడు... 

ఊరు మంచిదే ఎప్పుడు

నోరు మంచిదైనప్పుడు..

ఊరు మంచిదే ఎప్పుడు

తెలుసుకోలేని బుల్లెమ్మలకు... 

తప్పవులే తిప్పలు 


హేయ్..సిరిపల్లె చిన్నది...

చిందులు వేస్తున్నది

చిన్నగాలి తాకిడికే...

చిర్రుబుర్రుమన్నది

ఓయమ్మో..ఓ..భయమేస్తున్నదీ


పాటల ధనుస్సు  


14, అక్టోబర్ 2022, శుక్రవారం

నేలతో నీడ అన్నది | Nelatho needa annadi | Song Lyrics | Manchi Rojulu Vachayi (1972)

నేలతో నీడ అన్నది



చిత్రం :  మంచిరోజులు వచ్చాయి (1972)

సంగీతం :  టి. చలపతిరావు

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి:


నేలతో నీడ అన్నది నను తాకరాదని

పగటితో రేయి అన్నది నను తాకరాదని

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది

నేడు భర్తనే తాకరాదనీ...

ఒక భార్య అన్నది


చరణం 1:


వేలికొసలు తాకనిదే.. వీణ పాట పాడేనా

చల్లగాలి తాకనిదే.. నల్లమబ్బు కురిసేనా

తల్లి తండ్రి ఒకరినొకరు తాకనిదే...

నీవు లేవు... నేను లేను...

నీవు లేవు నేను లేను.. లోకమే లేదులే


నేలతో నీడ అన్నది నను తాకరాదని

పగటితో రేయి అన్నది నను తాకరాదని


చరణం 2:


రవికిరణం తాకనిదే నవకమలం విరిసేనా

మధుపం తను తాకనిదే మందారం మురిసేనా

మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే

మమత లేదు... మనిషి లేడు....

మమత లేదు... మనిషి లేడు...

మనుగడయే లేదులే..


నేలతో నీడ అన్నది నను తాకరాదని

పగటితో రేయి అన్నది నను తాకరాదని


చరణం 3:


అంటరానితనము ఒంటరితనము

అనాదిగా మీ జాతికి అదే మూలధనము

అంటరానితనము ఒంటరితనము

అనాదిగా మీ జాతికి అదే మూలధనము


ఇక సమభావం సమధర్మం

సహజీవనపనివార్యం

తెలుసుకొనుట మీ ధర్మం

తెలియకుంటే మీ కర్మం


నేలతో నీడ అన్నది నను తాకరాదని

పగటితో రేయి అన్నది నను తాకరాదని

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది

నేడు భర్తనే తాకరాదనీ...

ఒక భార్య అన్నది...

ఈ భార్య అన్నది


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు