ఈనాటి సంక్రాంతి
చిత్రం : మంచిరోజులు వచ్చాయి (1972)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : ఘంటసాల
పల్లవి :
ఏటేటా వస్తుంది సంక్రాంతి పండగ..ఆ... ఆ... ఆ
బీదసాదలకెల్ల ప్రియమైన పండగ..ఆ.. ఆ... ఆ
ఈనాటి సంక్రాంతి...
అసలైన పండగ సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...
అది కన్నుల పండగ
ఈనాటి సంక్రాంతి
అసలైన పండగ సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...
అది కన్నుల పండగ
ఎవ్వరేమి అనుకున్నా...
ఎంతమంది కాదన్నా
ఎవ్వరేమి అనుకున్నా..
ఆ..ఎంతమంది కాదన్నా
ఉన్నవాళ్ళ పెత్తనం... ఊడుతుందిలే..
సోషలిజం వచ్చే రోజు... దగ్గరుందిలే..
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ...
సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...
అది కన్నుల పండగ
చరణం 1 :
గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే..
ఆ..ఆ..ఆ..ఆ
ఈ కారులు మేడలు కొద్దిమందికే స్థిరము కావులే..
ఆ..ఆ..ఆ..ఆ
గుడిసె కాపురాలు మాకు ఉండబోవులే
ఈ కారులు మేడలు కొద్దిమందికే స్థిరము కావులే
ఓడలు బండ్లై... ఓ.. ఓ.. ఓ ఓహోయ్..
బండ్లు ఓడలై..ఆ..ఆ..ఆ
ఓడలు బండ్లై... బండ్లు ఓడలై
తారుమారు ఎప్పుడైనా...
తప్పదులే తప్పదులే
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ...
సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...
అది కన్నుల పండగ
చరణం 2 :
ఎగిరిపడే పులిబిడ్డలు పాపం ఏమైపోతారు...
ఏమైపోతారు..ఆహా హా హా
పిల్లుల్లాగా తొక ముడుచుకొని...
మ్యావ్ మ్యావ్ మంటారు
కిక్కురుమనక..ఆ..ఆ..ఆ..ఆ...
కుక్కిన పేనై..ఆ..ఆ..ఆ..ఆ
కిక్కురుమనక కుక్కిన పేనై...
చాటుగా నక్కుతారు...
చల్లగా జారుకుంటారు
ఈనాటి సంక్రాంతి
అసలైన పండగ సిసలైన పండగ
కష్టజీవులకు అది
ఎంతో కన్నుల పండగ అది కన్నుల పండగ
ఎవ్వరేమి అనుకున్నా...ఎంతమంది కాదన్న
ఎవ్వరేమి అనుకున్నా...ఎంతమంది కాదన్న
ఉన్నవాళ్ళ పెత్తనం... ఊడుతుందిలే
సోషలిజం వచ్చే రోజు దగ్గరుందిలే
ఈనాటి సంక్రాంతి అసలైన పండగ...
సిసలైన పండగ
కష్టజీవులకు అది ఎంతో కన్నుల పండగ...
అది కన్నుల పండగ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి