ఇది ఎన్నడు వీడని కౌగిలి
చిత్రం : ప్రేమ జీవులు (1971)
సంగీతం : విజయ కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు,
పల్లవి :
ఇది ఎన్నడు వీడని కౌగిలి
మన ఎదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం
ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ
చరణం 1:
కలువల మించిన నీ కనులు...
చిలికెను నాలో వెన్నెలలు
చిగురుల మించిన నీ తనువు...
చిందెను నాలో నవమధువు
అందాలన్నీ నీవేలే...
అందాలన్నీ నీవేలే...
అనుభవమంతా నాదేలేదే...
ఇది ఎన్నడు వీడని కౌగిలి
మన ఎదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం
ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ
చరణం 2:
కోవెల గంటల నాదంలో..
జీవన గానం విందాము
ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..
తీరని వలపుల ఊయలలో ...
తీయని కలలే కందాము
ఒకరికి ఒకరు నీడగా...
ఒకరికి ఒకరు నీడగా
ఉందాము దైవం తోడుగా...
ఇది ఎన్నడు వీడని కౌగిలి
మన ఎదలను కలిపిన రాతిరి
విరబూసెను నేడే అనురాగం
కరుణించెను తానే ఆ దైవం
ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి