RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, జనవరి 2023, శుక్రవారం

ఏ శుభ సమయంలో | Ye Shuba Samayamlo | Song Lyrics | Manasu Mangalyam (1970)

ఏ శుభ సమయంలో



చిత్రం :  మనసు-మాంగల్యం (1970)

సంగీతం :  పెండ్యాల

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి:


ఏ శుభ సమయంలో.. 

ఈ కవి హృదయంలో

నీ కాలి అందెలు మ్రోగినవో.. 

ఎన్నెన్ని ఆశలు పొంగినవో


ఏ శుభ సమయంలో .. 

ఈ చెలి హృదయంలో

నీ ప్రేమ గీతం పలికిందో.. 

ఎన్నెన్ని మమతలు చిలికిందో


అహ..అహ...అహ..అహ

అహాహ హాహహ.. హా.. హా.. హా


చరణం 1:


కలలో నీవే ఊర్వశివే.. 

ఇలలో నీవే ప్రేయసివే

కలలో నీవే ఊర్వశివే.. 

ఇలలో నీవే ప్రేయసి వే

ఆ..ఆ..నీడే లేని నాకోసం.. 

తోడై ఉన్న దేవుడవే

నీడే లేని నాకోసం.. 

తోడై ఉన్న దేవుడవే


చిక్కని చీకటిలోనా.. 

అతి చక్కటి జాబిలి నీవే


ఏ శుభ సమయంలో...ఓ...ఓ...ఓ...


చరణం 2:


మనిషై నన్ను దాచావు.. 

కవివై మనసు దోచావు

మనిషై నన్ను దాచావు.. 

కవివై మనసు దోచావు

నిన్నే గెలుచుకున్నాను.. 

నన్నే తెలుసుకున్నాను

నిన్నే గెలుచుకున్నాను.. 

నన్నే తెలుసుకున్నాను


పందిరి నోచని లతకు.. 

నవ నందనమైతివి నీవే


ఏ శుభసమయములో...ఓ..ఓ..ఓ..


చరణం 3:


నీలో విరిసి హరివిల్లు.. 

నాలో కురిసే విరిజల్లు

నీలో విరిసి హరివిల్లు.. 

నాలో కురిసే విరిజల్లు


ఆ...ఆ...ఆ..కనులే కాంచె స్వప్నాలు.. 

నిజమై తోచే స్వర్గాలు

కనులే కాంచె స్వప్నాలు.. 

నిజమై తోచే స్వర్గాలు


నవ్వుల ఊయలలోని.. 

నా యవ్వన శోభవు నీవే

ఏ శుభసమయంలో.. 

ఈ చెలి హృదయంలో

ఈ ప్రేమ గీతం పలికిందో..

ఎన్నెన్ని మమతలు చిలికిందో

అహ..అహ...అహ..అహ

అహాహ హాహహ.. హా.. హా.. హా.. హా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమొకో ఏమొకో చిగురు టధరమున | Emako Chigurutadharamuna | Song Lyrics | Annamayya (1997)

ఏమొకో ఏమొకో చిగురు టధరమున చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : అన్నమాచార్య  గానం : బాలు,  సాకి : గోవిందా నిశ్చలాలందా  మందా...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు