నీవే.. నీవే.. ఓ ప్రియా
చిత్రం : మనుషులు చేసిన దొంగలు (1977)
సంగీతం : సత్యం
గీతరచయిత : డా. సినారె
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల
పల్లవి :
నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా... నేనేలే ప్రియా...
చరణం 1 :
అలలై ఊగే ఈ పూలలో... కలలై మూగే ఈ వేళలో
నను పిలిచే కోరిక నీవే... నను పిలిచే కోరిక నీవే
పగలు రేయి నా ధ్యానమై... ఏనాడైనా నాదానవై
నను తలచే రాధిక నీవే... నను తలచే రాధిక నీవే
ఆ.. ఆ... ఆ...ఆ...
నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా... నేనేలే ప్రియా...
చరణం 2 :
పావన జీవన తీరాలలో...ఊహల కోయిల రాగలలో
నను కొలిచే దేవివి నీవే... నను కొలిచే దేవివి నీవే
అనురానికి వేదానివై... నా హృదయానికి నాదానివై
నను వలచే దైవము నీవే... నను వలచే దైవము నీవే
ఆ... ఆ.. ఆ ... ఆ...
నీవే.. నీవే.. ఓ ప్రియా
నా మది పలికిన మోహనగీతివి నీవే సుమా
నేనేలే ప్రియా... నీవేలే సుమా... నేనేలే ప్రియా...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి