మనిషే మారేరా రాజా
చిత్రం : బంగారు పంజరం (1969)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : జానకి, బాలు
పల్లవి :
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..... రాజా...
మనిషే మారేరా... రాజా... మనసే మారేరా
మనిషే మారేరా... రాజా... మనసే మారేరా
మనసులో... నా మనసులో...
సరికొత్త మమతలూరేరా
మనిషే మారేనా... రాజా...
మనసే మారేరా...
చరణం 1 :
రాజా.. ఆ.. ఆ... ఆ..
ఏ చోట దాగెనో ..ఇన్నాళ్ళు ఈ సొగసు
ఏ చోట దాగెనో ..ఇన్నాళ్ళు ఈ సొగసు
ఆ తోట పువులేనా... అలనాట లతలేనా
మనిషే మారేరా... రాజా...మనసే మారేరా
చరణం 2 :
ఆ..... ఆ..... ఆ..
ప్రతి పొదలో ప్రతి లతలో...
పచ్చనాకుల గూడేరా
ప్రతి పొదలో ప్రతి లతలో...
పచ్చనాకుల గూడేరా
గూట గూట దాగుండి...
కొత్త గువ్వా పాడేరా
మనిషే మారేనా రాజా...మనసే మారేరా
చరణం 3 :
ఆ..... ఆ..... ఆ..
అడుగడుగునా జగమంతా
అనురాగపు కనులకు
కులుకుతూ కొత్త పెళ్లి కూతురిలా తోచెనే
కులుకుతూ కొత్త పెళ్లి కూతురిలా తోచెనే
ఆనాటివె పువులైన... అలనాటి లతలైన
మనిషే మారెనే ..రాణి... మనసే మారెనే
ఆ...ఆ...ఆ...ఆ...అ..ఆ..ఆ...ఆ...ఆ...ఆ...అ..ఆ..
ఆ...ఆ...ఆ...ఆ...అ..ఆ..ఆ...ఆ...ఆ...ఆ...అ..ఆ..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి