అడగనా మాననా అమ్మాయి
చిత్రం : అందరికీ మొనగాడు (1971)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
అడగనా.. .. మాననా.. అమ్మాయి...
అడిగితే ఇస్తావా హాయి
అడగనా మాననా అమ్మాయి...
అడిగితే ఇస్తావా హాయి
అడిగినా.. ఆ... మానినా.. ఆ.. అబ్బాయి..
ఎన్నడో కలిపాను చేయి
అడిగినా మానినా అబ్బాయి..
ఎన్నడో కలిపాను చేయి
చరణం 1 :
మగవాడు చేసేది ఏమిటి...
వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది ఏమిటి...
వగలాడి మురిసేది ఏమిటి
మగవాడు చేసేది అల్లరి...
మగవాడు చేసేది అల్లరి...
వగలాడి విరిసేది మురిసేది రాగవల్లరి
అడగనా మాననా అమ్మాయి...
అడిగితే ఇస్తాను హాయి
చరణం 2 :
మగవాడు తలచేది ఏమిటి...
జవరాలు మరువనిది ఏమిటి
మగవాడు తలచేది ఏమిటి...
జవరాలు మరువనిది ఏమిటి
మగవాడు తలచేది కమ్మని కైపు
మగవాడు తలచేది కమ్మని కైపు
జవరాలు మరువనిది ప్రియతమ రూపు
అడగనా మాననా అమ్మాయి...
అడిగితే ఇస్తాను హాయి
చరణం 3 :
మగవాడు కోరేది ఏమిటి...
ప్రియురాలు ఇచ్చేది ఏమిటి
మగవాడు కోరేది ఏమిటి...
ప్రియురాలు ఇచ్చేది ఏమిటి
మగవాడు కోరేది ఆనందం...
మగవాడు కోరేది ఆనందం...
ప్రియురాలు ఇచ్చేది...
మెచ్చేది అనుబంధం
అడగనా మాననా అమ్మాయి...
అడిగితే ఇస్తావా హాయి
అడిగినా మానినా అబ్బాయి..
ఎన్నడో కలిపాను చేయి
అహా.. అహహ.. ఊ..హూ..ఉహు...హు...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి