RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vijaya krishnamurthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vijaya krishnamurthy లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జూన్ 2026, సోమవారం

పిలిచిన పలికేవు స్వామీ | Pilichina Palikevu Swamy | Song Lyrics | Aggi Dora (1967)

పిలిచిన పలికేవు స్వామీ 


చిత్రం: అగ్గిదొర (1967)

సంగీతం: విజయా కృష్ణమూర్తి

గీతరచయిత: జి. కృష్ణమూర్తి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఓ.. తిరుమలేశా చాలు చాలీ సోధన

భరించలేనయ్యా మొరవిన వేమి... 

ఓ తిరుమలేశా


పిలిచిన పలికేవు స్వామీ...

పిలిచిన పలికేవు స్వామీ... 

శిలగా నిలచేవేమీ

పిలిచిన పలికేవు స్వామీ... 

శిలగా నిలచేవేమీ...

పిలిచిన పలికేవు స్వామీ...


చరణం 1:


కాంతిని చూసే కన్నులలోనే... 

కన్నీరే నింపేవా

ఆ...కాంతిని చూసే కన్నులలోనే...

కన్నీరే నింపేవా

ఏడువ చేసి...వేడుక చూసి...

వేడుక చూసేవేమీ

ఏడువ చేసి...వేడుక చూసి...

వేడుక చేసేవేమీ....


పిలిచిన పలికేవు స్వామీ... 

శిలగా నిలచేవేమీ...

పిలిచిన పలికేవు స్వామీ... 

శిలగా నిలచేవేమీ...

పిలిచిన పలికేవు స్వామీ...


చరణం 2:


మనిషిని చేసి... మనసును కోసి... 

మలినమునే నింపేవా

మనిషిని చేసి... మనసును కోసి... 

మలినమునే నింపేవా

పువ్వులలోనా... వాసన తోనే... 

పురుగుల నింపేవేమీ

పువ్వులలోనా... వాసన తోనే.... 

పురుగులనింపేవేమీ...


పిలిచిన పలికేవు స్వామీ... 

శిలగా నిలచేవేమీ...

పిలిచిన పలికేవు స్వామీ...



- పాటల ధనుస్సు 


30, మే 2026, శనివారం

ఎందున్నావో ఓ చెలి | Endunnavo O Cheli | Song Lyrics | Aggi Dora (1967)

ఎందున్నావో ఓ చెలి 


చిత్రం: అగ్గిదొర (1967)

సంగీతం: విజయా కృష్ణమూర్తీ

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


ఎందున్నావో ఓ చెలి... 

అందుకో నా కౌగిలి

ఎందున్నావో ఓ చెలి... 

అందుకో నా కౌగిలి

ఎందున్నావో ఓ చెలి.. 

అందుకో నా కౌగిలి

ఎందున్నావో ఓ చెలి....


చరణం 1:


నిలువ లేను నిముషమైన 

నీవు లేనిదే...

తిరిగిపోను వలపు తీపి 

తెలుసుకోనిదే...

నిలువ లేను నిముషమైన 

నీవు లేనిదే...

తిరిగిపోను వలపు తీపి 

తెలుసుకోనిదే...


ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. 

నీకై ఉన్నాను..

ఇన్నినాళ్ళ వెతలు సైచి నీకై.. 

నీకై ఉన్నాను..


ఎందున్నావో ఓ చెలి... 

అందుకో నా కౌగిలి

ఎందున్నావో ఓ చెలి....


చరణం 2:


కొంగులోన నిన్ను దాచి 

పొంగిపోదునా...

కురులలోన తురిమి తురిమి 

పరవశింతునా....

కొంగులోన నిన్ను దాచి 

పొంగిపోదునా...

కురులలోన తురిమి తురిమి 

పరవశింతునా....


నీడవోలే యుగయుగాలు నీతో.. 

నీతో ఉంటాను..

నీడవోలే యుగయుగాలు నీతొ.. 

నీతో ఉంటాను..


ఎందున్నావో సుందరా... 

నా ముందు నిలువవేళరా..

ఎందున్నావో సుందరా...

ఇందున్నానే ఓ చెలి... 

అందుకో నా కౌగిలి

ఇందున్నానే ఓ చెలి...


- పాటల ధనుస్సు 


1, మార్చి 2024, శుక్రవారం

నెలవంక తొంగి చూసింది | Nelavanka Tongi Chusindi | Song Lyrics | Rajakota Rahashyam (1971)

నెలవంక తొంగి చూసింది 



చిత్రం : రాజకోట రహస్యం (1971)

సంగీతం :  విజయా కృష్ణమూర్తి

గీతరచయిత :  సినారె

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల 


పల్లవి :


నెలవంక తొంగి చూసింది.. 

చలిగాలి మేను సోకింది

మనసైన చెలువ కనులందు నిలువ.. 

తనువెల్ల పొంగి పూచింది


నెలవంక తొంగి చూసింది.. 

చలిగాలి మేను సోకింది

చిరునవ్వులొలుక చెలికాడు పలుక.. 

నిలువెల్ల వెల్లి విరిసింది

నెలవంక తొంగి చూసింది... 


చరణం 1:


ఏ జన్మలోని వరమో .. 

ఈ జన్మలోన దొరికె

ఏ జన్మలోని వరమో .. 

ఈ జన్మలోన దొరికె

ఏ పూలనోము ఫలమో .. 

నీ రూపమందు నిలిచె

సుడిగాలులైన ..జడివానలైన.. 

విడిపోని బంధమే వెలసె


నెలవంక తొంగి చూసింది .. 

చలిగాలి మేను సోకింది 


చరణం 2:


ఆనాటి వలపు పాట .. 

ఈనాటి బ్రతుకు బాట

ఆనాటి వలపు పాట .. 

ఈనాటి బ్రతుకు బాట

ఆనాటి కలవరింత .. 

ఈనాటి కౌగిలింత

ఏనాటికైన .. ఏ చోటనైన 

విడిపోనిదోయి మన జంట


నెలవంక తొంగి చూసింది .. 

చలిగాలి మేను సోకింది

చిరునవ్వులొలుక చెలికాడు పలుక .. 

నిలువెల్ల వెల్లి విరిసింది

నెలవంక తొంగి చూసింది .. 

చలిగాలి మేను సోకింది


పాటల ధనుస్సు 


6, అక్టోబర్ 2023, శుక్రవారం

ఈశ్వరీ జయము నీవే | Eswaree Jayamuneeve | Song Lyrics | Rajakota Rahashyam (1971)

ఈశ్వరీ జయము నీవే



చిత్రం : రాజకోట రహస్యం  (1971)

రచన : డా॥ సి.నారాయణరెడ్డి

సంగీతం : విజయా కృష్ణమూర్తి

గానం : ఘంటసాల, బృందం


శ్లోకం :

సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే

శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే


పల్లవి :

ఈశ్వరీ జయము నీవే 

పరమేశ్వరీ అభయమీవే 

ఈశ్వరీ జయము నీవే 

పరమేశ్వరీ అభయమీవే


చరణం : 1

సూర్యులు కోటిగ చంద్రులు కోటిగ

మెరసిన తేజము నీవే దేవి

శక్తి వర్ధనివి వరదాయినివే 

శక్తి వర్ధనివి వరదాయినివే 

ఇహమూ పరమూ నాకిక నీవే


చరణం : 2

మంత్రతంత్రముల మాయల ప్రబలిన

క్షుద్రుల పీడకు బలియగుటేనా

దుష్టశక్తులను రూపుమాపగ... 

దుష్టశక్తులను రూపుమాపగ... 

మహా మహిమనే నాకిడ లేవా


చరణం : 3

నిరపరాధులగు తల్లిదండ్రులు సతి

క్రూరుని హింసకు గురియగుటేనా

దుర్మార్గులనిక నాశము చేసి 

దుర్మార్గులనిక నాశము చేసి

తరించు వరమిడి దయగనరావా

ఓం నారాయణి... ఓం నారాయణి


చరణం : 4

ప్రాణము లైదుగ వేదనలైదుగ

పరిపరి విధముల నినువేడితినే

అమోఘ మహిమల ఆదిశక్తివే

ఓం నారాయణి... ఓం నారాయణి

అమోఘ మహిమల ఆదిశక్తివే

చలమూ బలమూ నాకికనీవే దేవి... దేవి...

ఓం నారాయణి... ఓం నారాయణి 

ఓం నారాయణి... ఓం నారాయణి 


పాటల ధనుస్సు 

30, జనవరి 2023, సోమవారం

సాగే అలలపైన ఊగే చందమామ | Sage Alalapaina Ooge chandamama | Song Lyrics | Jaganmohini (1978)

సాగే అలలపైన ఊగే చందమామ



చిత్రం : జగన్మోహిని (1978)

సంగీతం : విజయకృష్ణమూర్తి

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


సాగే అలలపైన... ఊగే చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ

మనసు కలువలో చూడు...  

దాగున్నాడు ఈ చందమామ

మనసు కలువలో చూడు... 

దాగున్నాడు..ఈ చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ


చరణం 1 :


ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో

ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో

ఆ తడిసిన వెన్నెల ముడివేయించిన 

సడలని కౌగిలిలో... చలిలో

నులి వేడి కలలు కందామా

సాగే అలలపైన... ఊగే చందమామ



చరణం 2 :


వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో

వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో

ఆ ఉబికిన పొంగుల మాటున దాగని

ఊహల అలజడిలో ... జడిలో

చెలరేగి..రేగి పోదామా


సాగే అలలపైన... ఊగే చందమామ

మనసు కలువలో చూడు...  

దాగున్నాడు ఈ చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ


తందానే.. తందానేతందానే 

తందానేతందానేతందానే.. 

తందానేతందానే తందానేతందానే


పాటల ధనుస్సు  


6, జనవరి 2023, శుక్రవారం

ఇది ఎన్నడు వీడని కౌగిలి | Idi Ennadu veedani kougili | Song Lyrics | Prema Jeevulu (1971)

ఇది ఎన్నడు వీడని కౌగిలి



చిత్రం : ప్రేమ జీవులు (1971)

సంగీతం : విజయ కృష్ణమూర్తి

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు, 


పల్లవి :


ఇది ఎన్నడు వీడని కౌగిలి

మన ఎదలను కలిపిన రాతిరి

విరబూసెను నేడే అనురాగం

కరుణించెను తానే ఆ దైవం


ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ


చరణం 1:


కలువల మించిన నీ కనులు...  

చిలికెను నాలో వెన్నెలలు

చిగురుల మించిన నీ తనువు...  

చిందెను నాలో నవమధువు


అందాలన్నీ నీవేలే... 

అందాలన్నీ నీవేలే...

అనుభవమంతా నాదేలేదే...


ఇది ఎన్నడు వీడని కౌగిలి

మన ఎదలను కలిపిన రాతిరి

విరబూసెను నేడే అనురాగం

కరుణించెను తానే ఆ దైవం


ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ


చరణం 2:


కోవెల గంటల నాదంలో.. 

జీవన గానం విందాము

ఆ..ఆ..ఆ..ఆ..ఆ...ఆ..ఆ..

తీరని వలపుల ఊయలలో ...

తీయని కలలే కందాము


ఒకరికి ఒకరు నీడగా... 

ఒకరికి ఒకరు నీడగా

ఉందాము దైవం తోడుగా... 


ఇది ఎన్నడు వీడని కౌగిలి

మన ఎదలను కలిపిన రాతిరి

విరబూసెను నేడే అనురాగం

కరుణించెను తానే ఆ దైవం


ఇది ఎన్నడు వీడని కౌగిలి....ఈ..ఈ..ఈ


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు