RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
narasimha raju songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
narasimha raju songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2023, శుక్రవారం

అరికాలు నిమరని అరకంట చూడని | Arikalu Nimaranee | Song Lyrics | Maa oori Peddamanushulu (1980)

అరికాలు నిమరని అరకంట చూడని



చిత్రం : మా వూరి పెద్దమనుషులు/రాహువు-కేతువు) (1980)

సంగీతం : సత్యం 

గీతరచయిత :  సినారె 

నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :

అరికాలు నిమరని.. అరకంట చూడని

అరనవ్వు విసరని.. మరి మరి మరి మరి మరి మరి 

అరికాలు నిమిరినా.. అరకంట చూసినా

అరనవ్వు విసిరినా.. సరి సరి సరి సరి సరి  

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


చరణం 1 :


బులిపించే నీ వయసేమో పలుకు 

పలుకు పలుకు పలకమంది

గుబులేసే నా గుండెల్లో కళుకు 

కళుకు కళుకు కళుకుమంది 

బులిపించే నీ వయసేమో పలుకు 

పలుకు పలుకు పలకమంది

గుబులేసే నా గుండెల్లో కళుకు 

కళుకు కళుకు కళుకుమంది 


ఆ గుబులు తీయనిదమ్మా.. 

అది నీకే తెలియనిదమ్మా

ఆ గుబులు తీయనిదమ్మా.. 

అది నీకే తెలియనిదమ్మా

ఆ వింత మరి కొంత చిగురించాలంటే...

అరికాలు నిమరని.. అరకంట చూడని

అరనవ్వు విసరని.. సరి సరి సరి సరి సరి

ఉ.. ఉ.. ఉ.. ఉ.. 


చరణం 2 :


గడుసైనా కోరికయేమో అడుగు 

అడుగు అడుగు అడగమంది

తొలి సిగ్గు అలజడి ఏమో నిలువు 

నిలువు నిలువు నిలవమంది 

గడుసైనా కోరికయేమో అడుగు 

అడుగు అడుగు అడగమంది

తొలి సిగ్గు అలజడి ఏమో నిలువు 

నిలువు నిలువు నిలవమంది


ఒక చెంప ముద్దంటుంది.. 

ఒక చెంప వద్దంటుంది

ఆ రెంటి చెలగాట సరి చెయ్యాలంటే... ఆ


అరికాలు నిమరని.. అరకంట చూడని

అరనవ్వు విసరని.. మరి మరి మరి మరి 


అరికాలు నిమిరినా.. అరకంట చూసినా

అరనవ్వు విసిరినా.. సరి సరి సరి సరి సరి సరి

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


పాటల ధనుస్సు 


30, జనవరి 2023, సోమవారం

సాగే అలలపైన ఊగే చందమామ | Sage Alalapaina Ooge chandamama | Song Lyrics | Jaganmohini (1978)

సాగే అలలపైన ఊగే చందమామ



చిత్రం : జగన్మోహిని (1978)

సంగీతం : విజయకృష్ణమూర్తి

గీతరచయిత : సినారె

నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


సాగే అలలపైన... ఊగే చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ

మనసు కలువలో చూడు...  

దాగున్నాడు ఈ చందమామ

మనసు కలువలో చూడు... 

దాగున్నాడు..ఈ చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ


చరణం 1 :


ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో

ఎగిసే చినుకులలో...  అర తడిసిన వెన్నెలలో

ఆ తడిసిన వెన్నెల ముడివేయించిన 

సడలని కౌగిలిలో... చలిలో

నులి వేడి కలలు కందామా

సాగే అలలపైన... ఊగే చందమామ



చరణం 2 :


వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో

వలచిన గుండెలలో... వెలికుబికిన పొంగులలో

ఆ ఉబికిన పొంగుల మాటున దాగని

ఊహల అలజడిలో ... జడిలో

చెలరేగి..రేగి పోదామా


సాగే అలలపైన... ఊగే చందమామ

మనసు కలువలో చూడు...  

దాగున్నాడు ఈ చందమామ

సాగే అలలపైన... ఊగే చందమామ


తందానే.. తందానేతందానే 

తందానేతందానేతందానే.. 

తందానేతందానే తందానేతందానే


పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు