శ్రీరస్తు మదనా శృంగార వదనా
చిత్రం : సంపూర్ణ ప్రేమాయణం (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
హుర్రే....
శ్రీరస్తు మదనా... శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఓసిసి లలనా... నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..
శ్రీరస్తు మదనా... శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఓసిసి లలనా.... నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..
చరణం 1 :
జారకుండా జారుపైట ఆపగలనా...
మానకుండా ఆరుబైట ఉంచగలనా...
వచ్చే ఈడు రాకుండా నేనాపగలనా...
తీరా వస్తే తీరకలేదు అనగలనా....
ఓ ఇందువదనా ఈనాటి భజన...
కౌగిళ్ళలో చేయాలమ్మ రాత్రి పొద్దున్న...
ఇద్దరు ఒకటై చేద్దామమ్మ ఎవ్వరు వద్దన్నా...
శ్రీరస్తు మదనా... నేనొపగలనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా
చరణం 2 :
వేళా లేదు పాళా లేదు ఏమి తపనా...
వేళం వెర్రి ముదిరిపోయే ఎంత చెప్పినా...
పూటా పూటా వెయ్యలేను పూల వంతెనా...
రేపు మాపు తిప్పలాయే రెప్ప పండునా...
ఓ హంసగమన నీ మత్తు వలనా...
వేశానమ్మ వెన్నెల్లోనే వెండి నిచ్చెనా...
దగ్గర కొస్తే ముగ్గురమౌతాం... తానాతందానా...
శ్రీరస్తు మదనా... శృంగార వదనా
ఈ శీతాకాలం ఒంటిగ ఉండగలనా
ఓసిసి లలనా... నేనొపగలనా
ఈ మాఘమాసం వెంట కట్టుకుందునా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా
టకచికి టకచికి టకచిటి టకచిటి.. ఠా.. ఠా.. ఠా..
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి