చలి జ్వరం.. చలి జ్వరం
చిత్రం : బంగారు చెల్లెలు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల, బాలు
పల్లవి :
చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది.. చెలి జ్వరం
చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది.. చెలి జ్వరం
మల్లెపూలు ముసిరినా.. పిల్లగాలి విసిరినా..
మాపకేళ్ళకొస్తుంది ప్రతిదినం..
చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది చలి జ్వరం
చందమామ పొడిచినా..
అందగాడు పిలిచినా
సందెవేళకొస్తుంది ప్రతిదినం..
చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది చలి జ్వరం
చరణం 1 :
మాట వినను పొమ్మన్న మనసుల్లో..
మాటమాట రమ్మన్న వయసుల్లో
మాట వినను పొమ్మన్న మనసుల్లో..
మాటమాట రమ్మన్న వయసుల్లో
ముసిముసి నవ్వులూ.. విసిరే కవ్వింతలో..
కసికసిగా పెనవేసే కౌగిలింతలో
ముసిముసి నవ్వులూ.. విసిరే కవ్వింతలో..
కసికసిగా పెనవేసే కౌగిలింతలో
ఒకరికొకరు మందంది వింత జ్వరం..
ఆహా..ఒకరికొకరు మందంది వింత జ్వరం
ఇద్దరు ఇచ్చిపుచ్చుకొమ్మంది..
ఏమి జ్వరం..ఇది ఏమి జ్వరం..
మ్మ్..చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది.. చెలి జ్వరం
మల్లెపూలు ముసిరినా.. పిల్లగాలి విసిరినా..
మాపకేళ్ళకొస్తుంది ప్రతిదినం..
చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది చలి జ్వరం..
చరణం 2 :
మబ్బులెంత కురిసినా తడవదూ..
ఆకాశం తడవదూ
మాటలెన్ని చెప్పినా తీరదు..
ఆరాటం తీరదు
మబ్బులెంత కురిసినా తడవదూ..
ఆకాశం తడవదూ
మాటలెన్ని చెప్పినా తీరదు..
ఆరాటం తీరదు
తొలకరి చినుకులే ఏరులైన తీరులో..
ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో
తొలకరి చినుకులే ఏరులైన తీరులో..
ఇరువురు ఏకమై ఎల్లువైన వేళలో
ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం..
ఆహా..ఎప్పుడెప్పుడంటుంది ఏమి జ్వరం
పెళ్ళెప్పుడెప్పుడంటుంది ప్రేమ జ్వరం..
మన ప్రేమ జ్వరం
చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది.. చెలి జ్వరం
చందమామ పొడిచినా..
అందగాడు పిలిచినా
సందెవేళకొస్తుంది ప్రతిదినం..
చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది.. చెలి జ్వరం
మ్మ్..చలి.. జ్వరం.. చలి.. జ్వరం..
ఇది..చలి జ్వరం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి