RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

1, నవంబర్ 2022, మంగళవారం

అందమంత మోసుకొచ్చా | Andamanta mosukocha | Song Lyrics | Shakti (1983)

అందమంత మోసుకొచ్చా



చిత్రం : శక్తి (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి : 


లలల.... లా ల...ల... ల... లా

అందమంత మోసుకొచ్చా... 

అందగాడి కోసమొచ్చా

రారా రాకుమారా... నన్నే ఏలుకోరా..

వయ్యారీ బుల్లోడా...  అందాలే నీవయ్యా 

beauty queen.. లా.. beauty queen.. లా..

లలలలా... లలలలా


అందమంత మెచ్చుకొన్నా... చం

దమామలిచ్చుకొన్నా

రావే..రాణిబొమ్మా..నీదే రాచనిమ్మ..

వయ్యారీ బుల్లెమ్మా... అందాలే నావమ్మా..

lovely king... లా... lovely king..


లలలలా...  లలలలా 



చరణం 1 :


చిలకలకొలికి కులుకే సింగారం...

చిచ్చులు పెడుతూ రగిలే శృంగారం 


జిలిబిలి ముద్దులు విప్పిన సింధూరం

చెరిపెను ఇద్దరి వలపులకీ దూరం


చక్కదనాల రాణీ... చెక్కిలి చెక్కర కేళీ

చెక్కిన నాడే కానీ... చుక్కలు చూడని బోణీ


లలలలా... లలలలలా..


అందమంత మెచ్చుకొన్నా... 

చందమామ ఇచ్చుకొన్నా

రారా రాకుమారా... నన్నే ఏలుకోరా..

వయ్యారీ బుల్లెమ్మా... అందాలే నావమ్మా 

lovely king...... lovely king... 

లలలలా మ్మ్... .హూ..  



చరణం 2 :




ఉలిపిరి చీరకు ఊపిరి పైటంటా.. లలలలా

జారినపైటే... జావళిపాటంటా.. లలలలా 


చూసిన కన్నే రాయని కవితంటా... లలలలా

కమ్మని కవితకు కౌగిలి ఇల్లంటా... లలలలా 


మోవికి అందే మోవీ... మోహన పిల్లనగ్రోవీ..

హాయిగ ప్రాణాలూదే... అల్లరి పల్లవి రాణీ..

లలలలా..... హుహుహూ..


అందమంత మోసుకొచ్చా... 

అందగాడి కోసమొచ్చా

రావే రాణిబొమ్మా... నీదే రాచనిమ్మ

వయ్యారీ బుల్లోడా అందాలే..నీవయ్యా


beauty queen.... beauty queen.. 

లలలలా... లలలలా

lovely king... లా... lovely king..

లలలలా లలలలా... ఆహ..అహహహా...

ఓహో..ఓహోహోహో..


పాటల ధనుస్సు  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు