RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

7, నవంబర్ 2022, సోమవారం

మేఘమా నీలి మేఘమా | Meghama Neeli Meghama | Song Lyrics | Bahudoorapu Batasari (1983)

మేఘమా... నీలి మేఘమా



చిత్రం :  బహుదూరపు బాటసారి (1983)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత : దాసరి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


మేఘమా... నీలి మేఘమా..

మేఘమా... నీలి మేఘమా

ఉరమకే.. మెరవకే నీలి నీలి మేఘమా

మేఘమా..  నీలి మేఘమా

ఉన్న రూపం మార్చుకుని.. 

నిన్ను నువ్వే కాల్చుకుని

వానవై కురవకే త్యాగమై కరగకే.. 

మేఘమా.. నీలి మేఘమా...


చరణం 1 :


ఫ్రతి ప్రసవం గండమని.. 

ప్రతి నిముషం మరణమని.. 

తెలిసి కూడ కన్నతల్లులు..

ఫ్రతి ప్రసవం గండమని.. 

ప్రతి నిముషం మరణమని.. 

తెలిసి కూడ కన్నతల్లులు..

మరల మరల కంటారు.. 

పగటి కలలు కంటారు.. 

బిడ్డ దైవం అంటారు

దైవమే రాయి అని 

ఉలుకు పలుకు లేనిదని 

తెలుసుకోరు పిచ్చి తల్లులు


మేఘమా.. నీలి మేఘమా 

ఉరమకే.. మెరవకే.. నీలి నీలి మేఘమా..

మేఘమా..  నీలి మేఘమా...


చరణం 2:


సాగరమే సంసారమని.. 

ఈదటమే కష్టమని.. 

మరచిపోయి కన్న తండ్రులు

సాగరాన పయనిస్తారు...  

మునిగి తేలుతుంటారు

మునకే మిగులునని.. 

కన్నందుకు ఫలితమని 

తెలుసుకోరు పిచ్చి తండ్రులు


మేఘమా నీలి మేఘమా.. 

ఉరమకే మెరవకే.. నీలి నీలి మేఘమా..

మేఘమా...  నీలి మేఘమా...

ఉన్న రూపం మార్చుకుని.. 

నిన్ను నువ్వే కాల్చుకుని

వానవై కురవకే త్యాగమై కరగకే.. 

మేఘమా.. నీలి మేఘమా


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు