దండాలమ్మో దండాలమ్మో
రచన : రామకృష్ణ దువ్వు
స్వరకల్పన : శ్రీనివాస్
గానం : శ్రీనివాస్
ఆల్బం : అమ్మలు
పల్లవి:
దండాలమ్మో దండాలమ్మో
లోకాలనేలేటి నూకాలమ్మో
మన్నించమ్మో దయచూడమ్మో
జగమేలే ఓ జననీ మా గౌరమ్మో
ఎన్నెన్నో రూపాల్లో వెలసినావమ్మా
మా వాడ నిలచినావు నూకాలమ్మా
సంసార బంధంలో చిక్కుకున్నాము
ఏదారి తెలియకుండ తిరుగుతున్నామూ
నీ పాదాలే చేరేము ఆదుకోవమ్మో …
॥ దండాలమ్మో॥
1 చరణం:
మరుమల్లె పూవంటి మనసున్న మా తల్లీ
చూపుల్లో వెన్నెలలూ సదా కురిపించే శ్రీవల్లీ
మరుమల్లె పూవంటి మనసున్న మా తల్లీ
చూపుల్లో వెన్నెలలూ సదా కురిపించే శ్రీవల్లీ
మహజ్వాలా రూపిణివై మహిషాసుర మర్ధనివై
ఆదిపరాశక్తివై ఆదుకొనే తల్లివై
విశ్వసృష్టి కారణివై విజయాలకు సారధివై
ఆకలి బాధలు పోగొట్టే అమ్మ అన్నపూర్ణవై
మాకోసం మాచెంతే నిలచేవమ్మో …
॥దండాలమ్మో॥
2 చరణం:
మాపైనే అలకేలమ్మో నీ దీవెనలే కావాలమ్మో
నీశరణే వేడేమమ్మో మమ్ము చల్లంగా చూడాలమ్మో
మాపైనే అలకేలమ్మో నీ దీవెనలే కావాలమ్మో
నీశరణే వేడేమమ్మో మమ్ము చల్లంగా చూడాలమ్మో
శతృభయంకారిణి వనీ సకల పాప హారిణి వనీ
అమ్మ బ్రహ్మచారిణి వనీ సర్వ మంగళ కారిణి వనీ
నిన్నే నమ్మి వచ్చాము నీకే హారతులిచ్చేమూ
నీ గుడి ముంగిట నిలిచేము నిన్నే భక్తితో కొలిచేము
ఇకనైనా మా పూజలందుకోవమ్మో
॥దండాలమ్మో॥
- రామకృష్ణ దువ్వు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి