RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

26, నవంబర్ 2022, శనివారం

చీరకట్టింది సింగారం| Cheera kattindi Singaram | Song Lyrics | Devatha (1982)

చీరకట్టింది సింగారం



చిత్రం: దేవత (1982)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల




పల్లవి :


హ్హా..ఆ..చీరకట్టింది సింగారం.. మ్మ్

చంప పూసింది.. మందారం..మ్మ్

మేను మెరిసింది బంగారం.. 

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

అమ్మమ్మ కొత్తగుంది ఈ మేళం..మ్మ్

ఇన్నాళ్ళు ఎక్కడుంది..వయ్యారమూ..మ్మ్


హోయ్..ఈ...చీరకట్టింది సింగారం..

మ్మ్చంప పూసింది..మందారం..

మ్మ్మేను మెరిసింది..బంగారం..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్అమ్మమ్మ 

కొత్తగుంది..ఈ మేళం..

మ్మ్ఇన్నాళ్ళు ఎక్కడుంది..

వయ్యారమూ..మ్మ్



చరణం 1 :


కట్టుకొన్న చీరకేమో గీరవచ్చెను..హోయ్

కట్టుకొనె వాడినని గిచ్చి పెట్టెను..హోయ్

నిన్ను చూసి వయసుకే వయసు వచ్చేను..హోయ్

వెన్నెలొచ్చి దాన్ని మరి రెచ్చగొట్టెను..హోయ్


కన్నె సొగసుల కన్ను సైగలు..

ముద్దులు ఇచ్చి నిద్దరలేపి..వేదించెనూ

నిన్ను రమ్మని..నన్ను ఇమ్మని..

మెలకువ తెచ్చిపులకలు వచ్చి..మెప్పించెనూ


పొద్దు పొడుపు పూవల్లె..పూవు చుట్టు తేట్టెల్లె

నిన్ను నన్ను..నన్ను నిన్నూ..ఆడించెనూ


హ్హా..ఆ..చీరకట్టింది సింగారం..మ్మ్

చంప పూసింది..మందారం..మ్మ్

మేను మెరిసింది..బంగారం..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్


అమ్మమ్మ కొత్తగుంది..ఈ మేళం..మ్మ్

ఇన్నాళ్ళు ఎక్కడుంది..వయ్యారమూ..మ్మ్



చరణం 2 :


 ఆ హా హా హా..ఆ హా హా హా

ఆ హా హా హా..ఆ ఆ ఆ


ఆశలన్ని అందమైన..పందిరాయెనూ..హోయ్

ఆనందం అందుకొనె చంద్రుడాయెనూ..హోయ్


కళ్ళు రెండు నీ కోసం కాయలాయెను..హోయ్

పెళ్ళినాటికి అవి మాగి ప్రేమ పండును..హోయ్


సన్న జాజులు ఉన్న మోజులు

విరిసేరోజు మురిసేరోజు..రానున్నదీ..ఈ


పాల పుంతగా..మేను బంధిగ..

జీవితమంతా సెలయేరంట..కానున్నదీ


నిండు మనసు నవ్వల్లే..కొండమీది దివ్వల్లే

నీలో నాలో వెలిగే వెలుగే..వలపన్నదీ..ఈ


హ్హా..ఆ..చీరకట్టింది సింగారం..మ్మ్

చంప పూసింది మందారం..మ్మ్

మేను మెరిసింది బంగారం..

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్

అమ్మమ్మ కొత్తగుంది ఈ మేళం..మ్మ్

ఇన్నాళ్ళు ఎక్కడుంది వయ్యారమూ..మ్మ్


పాటల ధనుస్సు  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు