RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

5, అక్టోబర్ 2022, బుధవారం

అనురాగ శిఖరాన ఆలయం | Anuraga Sikharana Alayam | Song Lyrics | Rakta Sambhandalu (1975)

అనురాగ శిఖరాన ఆలయం



చిత్రం :  రక్త సంబంధాలు (1975)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం : సుశీల



పల్లవి :


అనురాగ శిఖరాన ఆలయం.. 

ఆ గుడిలోన ఆనంద జీవనం

సంసార దీపం.. సంతోష రూపం.. 

మురిపాల ఆరాధనం


అనురాగ శిఖరాన ఆలయం.. 

ఆ గుడిలోన ఆనంద జీవనం

సంసార దీపం.. సంతోష రూపం.. 

మురిపాల ఆరాధనం


ఏనాడు ఏ చోట ఉన్నా.. 

అనుబంధమే పావనం  

అనురాగ శిఖరాన ఆలయం.. 

ఆ గుడిలోన ఆనంద జీవనం

సంసార దీపం.. సంతోష రూపం.. 

మురిపాల ఆరాధనం



చరణం 1 :


గుండేలలో గుడి ఒకటు౦దీ.. 

గుడి వెనుక తోటోకటు౦దీ

గుండేలలో గుడి ఒకటు౦దీ.. 

గుడి వెనుక తోటోకటు౦దీ


గున్నమావి కొమ్మమీద చిలకలూ.. 

పలికినవే పంచదార పలుకులూ

గున్నమావి కొమ్మమీద చిలకలూ.. 

పలికినవే పంచదార పలుకులూ

ఏనాడు ఏ చోట ఉన్నా.. 

అనుబంధమే పావనం    


అనురాగ శిఖరాన ఆలయం.. 

ఆ గుడిలోన ఆనంద జీవనం

సంసార దీపం.. సంతోష రూపం.. 

మురిపాల ఆరాధనం


చరణం 2 :


మమకారమే ఆరని జ్యోతీ.. 

అది మదిలోన చల్లని శాంతీ

మమకారమే ఆరని జ్యోతీ.. 

అది మదిలోన చల్లని శాంతీ


దూరదూర తీరముల నావలూ.. 

చేరువగా చేర్చేవే మమతలూ

దూరదూర తీరముల నావలూ.. 

చేరువగా చేర్చేవే మమతలూ


ఏనాడు ఏ చోట ఉన్నా.. 

అనుబంధమే పావనం  

అనురాగ శిఖరాన ఆలయం.. 

ఆ గుడిలోన ఆనంద జీవనం

సంసార దీపం.. సంతోష రూపం.. 

మురిపాల ఆరాధనం


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు