మల్లెలు పూచే చల్లనివేళ
చిత్రం : సూర్యచంద్రులు (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు
పల్లవి :
మల్లెలు పూచే చల్లనివేళ...
అల్లరి ఊహలు చెలరేగే
మల్లెలు పూచే చల్లనివేళ...
అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా
చరణం 1 :
ఎన్నెన్ని ఆశలు ఎదలోన ముడిచీ...
ఇన్నాళ్ళు ఆ రాధ వేచిందీ
తన మాధవుని చేయి తాకిన ఆ రేయి
తన మాధవుని చేయి తాకిన ఆ రేయి
తనువెల్లా యమునా తరంగమై పొంగింది....
ఆ.. ఆ.. ఆ.. ఆ..
మల్లెలు పూచే చల్లనివేళ...
అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా
చరణం 2 :
హృదయాల అలజడి నయనాలు తెలుపగ
అధరాలు పొందేను గిలిగింతలు
కరములు కలిసే...
సుమ శరములు కురిసే
మరులు తొందరించే...
సిగ విరులు పరవశించే
తెరలుగా దొంతరలుగా స్పందించుపోవు
ఆ రాసకేళిలో... ఆ..
ప్రతి అణువు బృందా నికుంజమై పలికింది...
ఆ.. ఆ.. ఆ.. ఆ..
మల్లెలు పూచే చల్లనివేళ...
అల్లరి ఊహలు చెలరేగే
అల్లన మధువని ఝల్లన వలపే..
పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి