RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
mallelu puche challani vela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
mallelu puche challani vela లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, అక్టోబర్ 2022, బుధవారం

మల్లెలు పూచే చల్లనివేళ | Mallelu Puche Challani Vela | Song Lyrics | Surya Chandrulu (1978)

మల్లెలు పూచే చల్లనివేళ



చిత్రం :  సూర్యచంద్రులు (1978)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత  :  సినారె

నేపథ్య గానం :  బాలు 



పల్లవి :


మల్లెలు పూచే చల్లనివేళ... 

అల్లరి ఊహలు చెలరేగే

మల్లెలు పూచే చల్లనివేళ... 

అల్లరి ఊహలు చెలరేగే

అల్లన మధువని ఝల్లన వలపే..

పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా



చరణం 1 :



ఎన్నెన్ని ఆశలు ఎదలోన ముడిచీ... 

ఇన్నాళ్ళు ఆ రాధ వేచిందీ

తన మాధవుని చేయి తాకిన ఆ రేయి

తన మాధవుని చేయి తాకిన ఆ రేయి

తనువెల్లా యమునా తరంగమై పొంగింది.... 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


మల్లెలు పూచే చల్లనివేళ... 

అల్లరి ఊహలు చెలరేగే

అల్లన మధువని ఝల్లన వలపే..

పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా



చరణం 2 :



హృదయాల అలజడి నయనాలు తెలుపగ

అధరాలు పొందేను గిలిగింతలు

కరములు కలిసే...  

సుమ శరములు కురిసే

మరులు తొందరించే...  

సిగ విరులు పరవశించే

తెరలుగా దొంతరలుగా స్పందించుపోవు 

ఆ రాసకేళిలో... ఆ..

ప్రతి అణువు బృందా నికుంజమై పలికింది... 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


మల్లెలు పూచే చల్లనివేళ... 

అల్లరి ఊహలు చెలరేగే

అల్లన మధువని ఝల్లన వలపే..

పిల్లనగ్రోవిగ మ్రోగే..రాధికా..రాధికా


పాటల ధనుస్సు  

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు