RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

2, అక్టోబర్ 2022, ఆదివారం

ఒలె ఒలె ఒలె ఓలమ్మీ | Ole Ole Ole olammee | Song Lyrics | Soggadu (1975)

ఒలె ఒలె ఒలె.. ఓలమ్మీ



చిత్రం : సోగ్గాడు (1975)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల



పల్లవి :


ఉఫ్‌....

ఒలె ఒలె ఒలె.. ఓలమ్మీ.. 

ఉఫ్‌.. అంటేనే ఉలిక్కిపడ్డావే

ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే

ఒరె ఒరె ఒరె.. ఓరయ్యో 

ఉఫ్‌.. అంటేనే ఉలిక్కిపడలేదు

నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను  


ఒలె ఒలె ఓలమ్మీ.. 

ఉఫ్‌.. అంటేనే ఉలిక్కిపడ్డావే

ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే

ఒరె ఒరె ఒరె ఓరయ్యో.. 

ఉఫ్‌.. అంటేనే ఉలిక్కిపడలేదు

నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను 



చరణం 1 :


ఒంపు వొంపులో ఉంది 

నన్ను చంపుకు తినేంత వయ్యారం

ఆ వయ్యారంలో ఉంది 

మళ్ళీ బతికించేంత సింగారం

ఒంపు వొంపులో ఉంది 

నన్ను చంపుకు తినేంత వయ్యారం

ఆ వయ్యారంలో ఉంది 

మళ్ళీ బతికించేంత సింగారం


నీ ఊపిరిలోనే ఉంది 

నన్ను ఉడికించేంత వెచ్చదనం..  అయ్యో

నీ ఊపిరిలోనే ఉంది 

నన్ను ఉడికించేంత వెచ్చదనం

ఆ వెచ్చదనంలో ఉంది 

ఉడుకును తగ్గించేంత చల్లదనం


ఒలె ఒలె ఓలమ్మీ.. 

ఉఫ్‌ అంటేనే ఉలిక్కిపడ్డావే

ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే 



చరణం 2 :


కొప్పు నున్నగా దువ్వి 

దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు

ఆ గొబ్బి పూల సందిట్లో 

నేను గండు తుమ్మెదై తిరిగాను

కొప్పు నున్నగా దువ్వి 

దాంట్లో గొబ్బి పువ్వునే తురిమావు

ఆ గొబ్బి పూల సందిట్లో 

నేను గండు తుమ్మెదై తిరిగాను


తిరిగి తిరిగి రేపెట్టి 

నువ్వు పొలము దున్నుతూ ఉంటావూ

తిరిగి తిరిగి రేపెట్టి 

నువ్వు పొలము దున్నుతూ ఉంటావూ

అది తలుచుకుంటూ 

నేనింట్లో రాతిరి ఎప్పుడెప్పుడనివుంటాను

  

ఒరె ఒరె ఒరె ఓరయ్యో.. 

ఉఫ్‌.. అంటేనే ఉలిక్కిపడలేదు.. మరి

నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను 



చరణం 3 :


చెంగు చుట్టగా చుట్టి 

చేత్తో గంపను పట్టుకు నడిచేవు

ఆ గుట్టుగ ఉన్న అందాలు 

నువ్వే రట్టు చేసుకుంటున్నావు


పట్టపగలే గుట్టంతా.. 

అయినా.. నీకూ నాకూ తెలియనిదా

రట్టు గాని కాపురము 

వెయ్యి పుట్టుకలైనా కోరే వరము 


ఒలె ఒలె ఓలమ్మీ.. 

ఉఫ్‌.. అంటేనే ఉలిక్కిపడ్డావే

ఒళ్ళంతా నువ్వొంపులు తిరిగావే 


ఒరె ఒరె ఒరె ఓరయ్యో.. 

ఉఫ్‌.. అంటేనే ఉలిక్కిపడలేదు

నీ ఊపిరి తగిలి ఒంపులు తిరిగాను


పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు