RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
singirikona lakshmi narasimha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
singirikona lakshmi narasimha లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, అక్టోబర్ 2024, శుక్రవారం

కొండ కోనలలోన కొలువైన స్వామీ | Kondakonalalona Koluvaina Swamy | Sri Lakshmi Narasimha | Omkaram | RKSS Creations

 కొండ కోనలలోన కొలువైన స్వామీ

 


రచన : రామకృష్ణ దువ్వు

Creation : RKSS Creations

 

పల్లవి :


కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

 

చరణం 1:


రూపమున నిను చూడ

భీకరాకారా

మనమున కాంచిన

కరుణామూర్తీ

 

రూపమున నిను చూడ

భీకరాకారా

మనమున కాంచిన

కరుణామూర్తీ

 

ప్రతికూల స్తితులెన్నో

పగబట్టి నాయీ

ఉగ్ర ప్రఛండాగ్ని జ్వాలల

భష్మీకరించీ

అకాల మృత్యువుల నుండి

కాపాడు స్వామీ

 

ప్రతికూల స్తితులెన్నో

పగబట్టి నాయీ

ఉగ్ర ప్రఛండాగ్ని జ్వాలల

భష్మీకరించీ

అకాల మృత్యువుల నుండి

కాపాడు స్వామీ

 

కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

చరణం 2 :


దివిలోన భువిలోన

అణువణువు లోనా

నీవు కలవంటు

ప్రహ్లాదు పలుకగా

 

దివిలోన భువిలోన

అణువణువు లోనా

నీవు కలవంటు

ప్రహ్లాదు పలుకగా

 

ద్వార పాలకుని

శాపముపహరింపగా

స్థంబమున కనిపించె

ఉగ్ర రూపముగా

పాపాలు హరియించి

కరుణించు స్వామీ

 

ద్వార పాలకుని

శాపముపహరింపగా

స్థంబమున కనిపించె

ఉగ్ర రూపముగా

పాపాలు హరియించి

కరుణించు స్వామీ

 

కొండ కోనలలోన

కొలువైన స్వామీ

నిండు మనసుతోటి

నిను చేరినాము

గండముల పారద్రోలి

మము బ్రోవుమయ్య

చండ ప్రచండ తేజోమయ

శ్రీ లక్ష్మి నారసింహా

శ్రీ లక్ష్మి నారసింహా

 

 - ఓంకారం : RKSS Creations...

9, ఫిబ్రవరి 2022, బుధవారం

శ్రీధర భయహర కేసరిముఖ శ్రీ లక్ష్మీ నరసింహా | శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట | Song Lyrics | RKSS Creations

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాట


గీత రచన : రామకృష్ణ దువ్వు ,

స్వర కల్పన : ఎస్ వేణు మాధవ్ ,

గానం : టి కృష్ణారావు ,

రికార్డింగ్ : శ్రీ మాత డిజిటల్ రికార్డింగ్, విశాఖపట్నం 


పల్లవి:

శ్రీధర భయహర కేసరిముఖ శ్రీ లక్ష్మీ నరసింహా

ఈ కొండల నడుమ కోనల నందున అంబుజ నాభా

ధరణీ తలమున దానవు త్రుంచగ

స్థంబము నుండి ప్రకటితమైన

భీకర రూపా రౌద్ర నరసింహా

ఉగ్ర నరసింహా.. మహోగ్ర నరసింహా


1 చరణం:

నింగికి నేలకు నడుమన నీవు విశ్వంభరాయ

పగటికి రేయికి సంధిగ నీవు దర్శనమిచ్చావు

రుధిరము కారే కేశములు

ఖలుని ప్రేవులే కంఠ హారములు

భీకర రూపా నరసింహా

కొలిచే వారికి ఇలపై దైవము

ఆర్తితో చేరిన అభయమొసగే

కరుణామూర్తి వైకుంఠ నిలయా

శ్రీ లక్ష్మీ నరసింహా.. శ్రీ లక్ష్మీ నరసింహా


2. చరణం:

అంబుధి జొచ్చి సోమకు ద్రుంచిన వేదరక్షకా

వరాహ రూపమున ధరణిని గాచిన గరుడ వాహనా

అనలము చిమ్మే నేత్రద్వయము

ప్రభంజనమల్లే సింహ నాదము

బ్రహ్మాండ రూపా నరసింహా

కలియుగమందు ఇడుములు తీర్చగ

తిరుమల గిరిపై కొలువున్న

ప్రహ్లాదవరదా నరసింహా

శ్రీనివాసా .. శ్రీయోగ నరసింహా..


- రామకృష్ణ దువ్వు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు