RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

8, ఫిబ్రవరి 2022, మంగళవారం

ప్రేమంటే లోకంలో | Premante lokamlo | Song Lyrics | Anukunnadi Sadhista (1978)

ప్రేమంటే లోకంలో ఎవరికి తెలియదు


చిత్రం : అనుకొన్నది సాధిస్తా (1978)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు, శైలజ 

పల్లవి :

ప్రేమంటే లోకంలో... ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది.. నీకు నాకు తెలియదు
ప్రేమంటే లోకంలో..ఓ ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది.. నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓ.. ఎవరికి తెలియదు

చరణం 1 : 

గగనములో వెన్నెలలూ అందరు చూస్తారు
గగనములో వెన్నెలలూ అందరు చూస్తారు
చెలి చూపుల చంద్రకళలూ..ఎంతమంది చూడగలరు
కళ్ళు కళ్ళు కలవగనే..ఏ..వలపని అనుకొంటారు
కళ్ళు కళ్ళు కలవగనే..ఏ..వలపని అనుకొంటారు
గుండెలోని మూగభాష..ఎంతమంది వినగలరు
ప్రేమంటే లోకంలో..ఓ.. ఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది.. నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓఓఓ..ఎవరికి తెలియదు

చరణం 2 : 

ఏడడుగులు నడిపించేదీ....ఒకే బాట సాగమని
ఏడడుగులు నడిపించేదీ.... ఒకే బాట సాగమని
చేయి చేయి కలిపేదీ.... చెరిసగమై బ్రతకమనీ
కొంగులు ముడి వేసేది.. కోర్కెల ముడి విప్పమనీ..
కొంగులు ముడి వేసేది..కోర్కెల ముడి విప్పమనీ..
పానుపుపై చేరేది.. పరవశించిపోవాలనీ
ప్రేమంటే లోకంలో..ఓ..ఎవరికి తెలియదు
ప్రేమగాక వేరేది.. నీకు నాకు తెలియదు..ఊ
ప్రేమంటే లోకంలో..ఓ.. ఎవరికి తెలియదు

- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు