గాలి మళ్లింది నీ పైన
చిత్రం : యుగ పురుషుడు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
గాలి మళ్లింది నీ పైన..
గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది..
ఆపైన అడగకు ఏం జరిగినా
గాలి మళ్లింది నీ పైన..
గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది..
ఆపైన అడగకు ఏం జరిగినా
అహహ.. గాలి మళ్లింది నీ పైన
చరణం 1 :
వయసల్లె వచ్చింది జడి వానా..
తడి ముద్ద చేసింది పైపైన
వయసల్లె వచ్చింది జడి వానా..
తడి ముద్ద చేసింది పైపైన
సెగ ఎగిసి వచ్చింది లోలోనా..
సెగ ఎగిసి వచ్చింది లోలోనా..
మొగ గాలితో దీన్ని చల్లార్చుకోనా
గాలి మళ్లింది నీ పైన.. గోల చేస్తుంది నాలోనా...
చరణం 2 :
వానేమి చేస్తుంది వయసుండగా..
వయసేమి చేస్తుంది జత ఉండగా
వానేమి చేస్తుంది వయసుండగా..
వయసేమి చేస్తుంది జత ఉండగా
జతకుదిరి తీరాలి చలి ఉండగా..
చలి మంట ఎందుకు నేనుండగా
అహ... గాలి మళ్లింది నీ పైన..
గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది..
ఆపైన అడగకు ఏం జరిగినా
అహ.. గాలి మళ్లింది నీ పైన
చరణం 3 :
పదహారు దాటే ప్రాయానా..
పరవళ్లు తొక్కే చినదానా
పదహారు దాటే ప్రాయానా..
పరవళ్లు తొక్కే చినదానా
వేడెంత ఉన్నదో నీలోనా..
వేడెంత ఉన్నదో నీలోనా...
ఈ వేళ తేలాలి నా జతలోనా
గాలి మళ్లింది నీ పైన..
గోల చేస్తుంది నాలోనా
ఆగనంటుంది.. రేగమంటుంది..
ఆపైన అడగకు ఏం జరిగినా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి