శ్రీకాళహస్తీశ్వరా హరహర
చిత్రం : భక్త కన్నప్ప (1976)
సంగీతం : ఆదినారాయణరావు/సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : రామకృష్ణ
పల్లవి:
ఓం నమశ్శివాయ... ఆ...ఆ
శ్రీకంఠలోకేశ.. శ్రీకాళహస్తీశ
చిద్రూప కారుణ్య కల్పద్రుమా...
భక్త చింతామణి .. ఆర్త రక్షామణి
సర్వసర్వజ్ఞ సర్వాత్మకా
నీ పదార్థంబులన్ నెమ్మదిన్నిలిపి
భల్లూగ జీవమ్ములేకాగ్రతన్
ఉగ్రతన్ నిన్ను భావించి
సేవించ సాయుధ్యనిచ్చావు
తండ్రీ... ఈ...
మధాంధుండనై మొండినై
నిన్ను దుర్భాషలన్
ఎన్ని ధూషించినా.. ఆ...
దివ్య లింగమ్ము భంగమ్ము
కావింపగాజూచినా..
సర్వలోకోత్తరంభైన
నీ విశ్వరూపమ్ము జూపించినావే
నన్ను దీవించినావే... ఏ...ఏ
కర్మ పరిక్వముంజేసి
కైవల్యనియ్యంగ లేవా... ఆ...
ప్రభో పాహిమాం
పాహిమాం పాహిమాం... ఆ...
శ్రీకాళహస్తీశ్వరా... హరహర
కరుణించి నను బ్రోవరా...
దేవర.. కైవల్య పదమీయరా ...
శ్రీకాళహస్తీశ్వరా... హరహర
కరుణించి నను బ్రోవరా...
దేవర.. కైవల్య పదమీయరా ...
చరణం 1:
ఆలయమన్నది లేదని
నీకై అల్లెను గుడులను సాలీడు
ఆ భక్తుడు నీవు సంశోధించ
అగ్నిపరీక్షను పొందాడు
నీ గుడి రూపము చెరిపిన
దీపము మ్రింగ దలంచెను పురుగు
ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది
ముక్తినొసంగిన దేవా...
శ్రీకాళహస్తీశ్వరా... హరహర
కరుణించి నను బ్రోవరా...
దేవర.. కైవల్య పదమీయరా ...
చరణం 2:
పన్నగ మొక్కటి ప్రతి ఉదయమ్మున
ఎన్నో మణులను తెచ్చేదీ ..
నిన్నే పూజించేదీ
పాముయొనర్చిన పూజను మెచ్చక
ఏనుగు దానిని తుడిచేదీ ..
వేరే పూజలు చేసేదీ
ఒకరు యెనర్చిన పూజలునొల్లని
కరికాళమ్ములు పగబూనీ ..
తరుణము కొరకై వేచినవీ
తొండము నుండి దూరిన పాము
మెండుగ గజమును బాధించే
కొండను మోదగ కుంభము
పగులగ రెండొకతరి మరణించె
నీకై పోరిన ఆ ప్రాణులకు
నీ సాయుజ్యము లభియించే
జంతుసంతతికి ఇచ్చిన మోక్షము
సదాశివా ... దయచేయవా...
శ్రీకాళహస్తీశ్వరా... హరహర
కరుణించి నను బ్రోవరా...
దేవర.. కైవల్య పదమీయరా ...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి