మనిషైతే మనసుంటే
చిత్రం: అమాయకుడు (1968)
సంగీతం: బి. శంకర్
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి :
మనిషైతే.. మనసుంటే
మనిషైతే మనసుంటే..
కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా..
కురిసి జగతి నిండాలిరా
చరణం 1:
ఆగి ఆగి సాగి పోరా..
సాగి పోతూ చూడరా..ఆ..
ఆగి ఆగి సాగి పోరా..
సాగి పోతూ చూడరా..ఆ..
వేగి పోయే ఎన్నెన్నెని బ్రతుకులో..
వేడుకుంటూ ఎన్నెన్ని చేతులో
వేచి ఉన్నాయిరా..
మనిషైతే.. మనసుంటే
మనిషైతే మనసుంటే..
కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా..
కురిసి జగతి నిండాలిరా
చరణం 2:
తేలిపోతూ నీలి మేఘం..
జాలి జాలిగ కరిగేరా
తేలిపోతూ నీలి మేఘం..
జాలి జాలిగ కరిగేరా
కేలు చాపి ఆ దైవమే తన..
కేలు చాపి ఆకాశమే ఈ..
నేల పై ఒరిగెరా..
మనిషైతే.. మనసుంటే..
మనసుంటే మన్షైతే..
వైకుంఠమే ఒరుగురా
నీ కోసమే కరుగురా..
నీ కోసమే కరుగురా..
నీ కోసమే కరుగురా..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి