పాడితే శిలలైన కరగాలి
చిత్రం : గోరింటాకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
పాడితే శిలలైన కరగాలి
పాడితే శిలలైన కరగాలి...
జీవిత గతులైన మారాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో...
పాడిన పిదపే తెలియాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో...
పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి
చరణం 1 :
నీ పాటతోటి నే పగిలిపోవలే...
పాడమన్నది హృదయం
నీ పాటతోటి నే పగిలిపోవలే...
పాడమన్నది హృదయం
పెగలిరాక నా పాట జీరగా...
పెనుగులాడినది కంఠం
పెగలిరాక నా పాట జీరగా...
పెనుగులాడినది కంఠం
గొంతుకు గుండెకు ఎంత దూరం...
గొంతుకు గుండెకు ఎంత దూరం...
ఆశనిరాశకు అంతే దూరం
ఆశనిరాశకు అంతే దూరం...
పాడితే శిలలైన కరగాలి...
జీవిత గతులైన మారాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో...
పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి
చరణం 2 :
తాళి కట్టెడి వేళ కోసమే
వేచి చూసినది విరిమాలా
కట్టే వేళకు కట్టని తాళిని
కత్తిరించినది విధిలీలా
వేచిన కళ్ళకు కన్నీళ్ళా....
వేయని ముడులకు నూరేళ్ళా
నా పాటకు పల్లవి మారేనా...
ఈ పగిలిన గుండె అతికేనా
ఈ చితికిన బ్రతుకిక బ్రతికేనా.....
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి