ఆకాశం దించాలా నెలవంక తుంచాలా
చిత్రం : భక్త కన్నప్ప (1976)
సంగీతం : ఆదినారాయణరావు/సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల
పల్లవి:
ఆకాశం దించాలా..
నెలవంక తుంచాలా
సిగలో ఉంచాలా... ఆ...
ఆకాశం దించాలా..
నెలవంక తుంచాలా
సిగలో ఉంచాలా... ఆ...
చెక్కిలి నువ్వు నొక్కేటప్పటి
చక్కలి గింతలు సాలు
ఆకాశం నా నడుము..
నెలవంక నా నుదురు
సిగలో నువ్వేరా... ఆ... ఆ...
చరణం 1:
పట్టుతేనె తెమ్మంటే
చెట్టెక్కి తెస్తానే... తెస్తానే...
మిన్నాగు మణినైనా
పుట్టలోంచి తీస్తానే... తీస్తానే...
ఆ... పట్టుతేనె నీకన్నా
తియ్యంగా వుంటుందా..
మిన్నాగు మణికైనా
నీ ఇలువ వస్తుందా...
అంతేనా అంతేనా...
అవును అంతేరా... ఆ...
ఆకాశం అంచుల్లో
భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ...
ఆకాశం అంచుల్లో
భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ...
చరణం 2:
సూరీడు ఎర్రదనం
సిందూరం చేస్తానే... చేస్తానే...
కరిమబ్బు నల్లదనం
కాటుక దిద్దేనే... దిద్దేనే...
ఆ... నీ ఒంటి వెచ్చదనం
నన్నేలే సూరీడు
నీ కంటి చల్లదనం
నా నీడ నా గూడు
అంతేనా అంతేనా...
అవును అంతేరా... ఆ...
మెరిసేటి చుక్కల్నీ
మెడలోన చుట్టాలా
తలంబ్రాలు పొయ్యాలా...ఆ...
గుండెలోన గువ్వలాగ
కాపురముంటే చాలు
ఆకాశం అంచుల్లో
భూదేవి కలిసేలా
కౌగిట్లో కరిగేరా... ఆ...
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి