RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

13, ఫిబ్రవరి 2025, గురువారం

సాయి సాయి శ్రీ శిరిడి సాయి | శిరిడి సాయి జోలపాట | Sai Sai Sri Shiridi Sai | Song Lyrics | RKSS Creations

 శిరిడి సాయి జోలపాట


రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


సాయి సాయి శ్రీ శిరిడి సాయి

మా పాపాలు పోగొట్టె పరమాత్మ నీవు

ఎందరికో దారి చూపి అలసిపోయావు

కనుమూసి నిదురిస్తే కలుగును హాయి


చరణం 1:


పంచభూతాలను గుప్పిట చేబట్టి

అదుపులో జగతిని నడిపేవు నీవు

మా బ్రతుకు భారము నీ భుజాన మోసేవు

ఇకనైన ఓ సాయి నిదురించు హాయిగా


చరణం 2:


నాలుగు వేదాల సారమ్ము వివరించి

మానవుల సత్గతిన నడిపించు గురువీవు

మా కొరకు నీవెంతో దూరాలు నడిచేవు

దయచాలు ఓ సాయి విశ్రమించు హాయిగా

 

- RKSS Creations...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు