RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

ఎప్పుడూ మీ పాఠాలంటే | Eppudu mee pathalante | Song Lyrics | Amma Maata (1972)

ఎప్పుడూ మీ పాఠాలంటే



చిత్రం :  అమ్మ మాట (1972)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి  

నేపథ్య గానం :  సుశీల


పల్లవి:


సర్..సర్..సార్..


ఎప్పుడూ మీ పాఠాలంటే.. 

ఎలాగండి సార్

ఈరోజు నే చెపుతాను.. 

హియర్ మీ డియర్ సార్


చరణం 1:


ఒకటీ ఒకటీ కలిపితే రెండు..

అది గణితం

మనసూ మనసూ కూడితే..ఒకటే... 

ఇది జీవితం

గిరిగీసుకొని ఉండాలంటాయిగ్రంథాలు..

గిరిగీసుకొని ఉండాలంటాయి గ్రంథాలు..

పురివిప్పుకొని ఎగరాలంటాయి అందాలు...


ఎప్పుడూ మీ పాఠాలంటే.. 

ఎలాగండి సార్

ఈరోజు నే చెపుతాను.. 

హియర్ మీ డియర్ సార్


చరణం 2:


కళ్ళల్లో చూడండీ.. 

కనిపించును నీలాలు

పెదవుల్లో చూడండీ.. 

అగుపించును పగడాలు

దోసిలినిండా దొరుకుతాయి.. 

దోరనవ్వుల ముత్యాలు

కన్నెమేనిలో.. ఉన్నాయి..

కన్నెమేనిలో.. ఉన్నాయి

ఏ గనిలో దొరకని రతనాలు..మ్మ్..


ఎప్పుడూ మీ పాఠాలంటే..

ఎలాగండి సార్

ఈరోజు నే చెపుతాను..

హియర్ మీ డియర్ సార్


చరణం 3:


రాధా మాధవ రాగజీవనం.. 

ఒక బంధం

కలువా జాబిలి వింతకలయికే.. 

అనుబంధం

యుగయుగాలకూ మిగిలేదొకటే.. 

అనురాగం

యుగయుగాలకూ మిగిలేదొకటే.. 

అనురాగం

చెలి మనసెరిగిన చినవానిదేలే.. 

ఆనందం


ఎప్పుడూ మీ పాఠాలంటే..

ఎలాగండి సార్

ఈ రోజు నే చెపుతాను..

హియర్ మీ డియర్ సార్


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య | Gussa Rangaiah | Song Lyrics | Akali Rajyam (1980)

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య చిత్రం: ఆకలి రాజ్యం (1980) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: సుశీల పల్లవి: గుస్సా ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు