హేపీ బర్త్ డే మేఘనా
మేఘన జన్మదిన పాట
రచన : రామకృష్ణ దువ్వు
పల్లవి:
హేపీ బర్త్ డే మేఘనా
హేపీ బర్త్ డే మేఘన శివానీ
మురిపాల మేఘన పుట్టినరోజు
దివిలోని దేవతల కమనీయ దీవెనలు
ఇలలోన అందరి ప్రేమాశీస్సులు
ప్రతియేడు నీకు నవ్య ఉషస్సులు
హేపీ బర్త్ డే మేఘనా
హేపీ బర్త్ డే మేఘన శివానీ
చరణం 1:
గగనపు సిరిమల్లె కురిసెను
చిరు జల్లుగా
దినకరుడు వదలిన ప్రభాత
వెలుగు రేఖగా
వెన్నెల వేడిమి కలగలసిన
ఆరని దివ్వెగా
మాయింట వెలసెను కదలే
బంగరు తీగగా
బ్రతుకంతా నడవాలి
సుందర పూబాటన
చరణం 2:
చందమామ చూసేను
నీ మోమును అద్దమని
తళుకులీను తారలు
ఈసుపడు నీ కనులగని
చెలులచెంతనుండ
నందనవనాలు దరిచేరుగా
కన్నవారి కనుల మెరిసెను
మధుర స్వప్నముగా
నిత్యం ఆనందం తోడుగా
ఉండాలనే ఆకాంక్ష గా
- RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి