హే రేఖా శశిరేఖా
చిత్రం : మనుషుల్లో దేవుడు (1974)
సంగీతం : టి.వి. రాజు, ఎస్. హనుమంతరావు
గీతరచయిత : సి నారాయణ రెడ్డి
నేపధ్య గానం : బాలు
పల్లవి:
హే రేఖా .. శశిరేఖా
చిర్రు బుర్రులెందుకు ..
చెట్టా పట్టాలేసుకో
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా ..
అయ్యొ రామా
చరణం 1:
ఓ సఖీ .. మండె చెకుముకి ..
చురచుర చూపులే చూడకూ
ముక్కున కోపమూ ..
మొదటికి మోసమూ...
అదేనేమో ఆడపిల్లకు అందమూ
అవునా?
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా ..
అయ్యొ రామా
చరణం 2:
ఓ చెలి .. రగిలే జాబిలి..
ఉరుములు మెరుపులు మానుకో
తొలకరి జల్లులు .. తడిసిన మల్లెలా
తొలకరి జల్లులు .. తడిసిన మల్లెలా..
ఇలా ఇలా ఇలా ఒదిగిపో
ఏమంటావ్ ?
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా ..
అయ్యొ రామా
చరణం 3:
నీ మది ..పొరబడుతున్నది..
నిజమేదో ఎరుగకున్నది
అలజడి తగ్గితే .. నిలకడ కుదిరితే
అలజడి తగ్గితే నిలకడ కుదిరితే..
అదే అదే అదే తెలుస్తుందిలే ..
అసలు కథ
కోపమా .. తాపమా
కోపమా .. తాపమా
అయ్యొ రామా ..అయ్యొ రామా ..
అయ్యో రామా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి