గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
చిత్రం : అందరూ దొంగలే (1974)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : సుశీల,రామకృష్ణ
పల్లవి :
గుడుగుడు గుంచం.. గుళ్ళో రాగం..
పాముల పట్నం.. పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో . . .
మా అందరిలో
నన్నే చేసుకో.. నన్నే చేసుకో..
నన్నే చేసుకో.. నన్నే చేసుకో..
నన్నే పెళ్ళి చేసుకో
గుడుగుడు గుంచం.. గుళ్ళో రాగం..
పాముల పట్నం.. పటికి బెల్లం
నేనే పెళ్ళి చేస్తా . . . మీ అందరికీ
నేనే చేస్తా.. నేనే చేస్తా..
నేనే చేస్తా.. నేనే పెళ్ళి చేస్తా
చరణం 1 :
నీకు తగ్గదాన్నోయ్..
నీటైనదాన్నోయ్
ఆ.. వాటమున్న దాన్నొయ్..
వగలున్న దాన్నోయ్
నీకు తగ్గదాన్నోయ్ . . .
నీటైనదాన్నోయ్
వాటమున్న దాన్నొయ్..
వగలున్న దాన్నోయ్
పగలు సైగచేస్తే . . .
పరుగు పరుగునా వచ్చి
రేయంతా నీ కలలో కరిగిపోతానోయ్ ..
కరిగిపోతానోయ్
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం..
పాముల పట్నం పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో మా అందరిలో
నన్నే చేసుకో.. నన్నే చేసుకో..
నన్నే చేసుకో.. నన్నే చేసుకో...
నన్నే పెళ్ళి చేసుకో
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం..
పాముల పట్నం.. పటికి బెల్లం..
నేనే పెళ్ళి చేస్తా . . . మీ అందరికీ
నేనే చేస్తా . . . . నేనే చేస్తా . . .
నేనే చేస్తా . . . నేనే పెళ్ళి చేస్తా
చరణం 2 :
గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె..
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
గుత్తమైన గుండెల్లో కోర్కె ఇమడనంటె..
నీ గుప్పెట్లో నా నడుము గిరగిర తిరగాలి
కోరమీసం నీది... కొంటె చూపు నాది
కోరమీసం నీది.. కొంటె చూపు నాది
కోరి కోరి ఆ రెండు కోలాటం ఆడాలి...
ఆడాలి
గుడుగుడు గుంచం . . గుళ్ళో రాగం..
పాముల పట్నం... పటికి బెల్లం
నన్నే పెళ్ళి చేసుకో... మా అందరిలో
నన్నే చేసుకో... నన్నే చేసుకో...
నన్నే చేసుకో... నన్నే చేసుకో...
నన్నే పెళ్ళి చేసుకో
చరణం 3 :
పొంగుతున్న ఒంపుల్లో
పొగరు నాకు తెలుసు..
రంగేళి వయసులో సింగారం తెలుసు
పొంగుతున్న ఒంపుల్లో
పొగరు నాకు తెలుసు..
రంగేళి వయసులో సింగారం తెలుసు
లొంగని మీ పరువాలు లొంగ దీసుకుంటా..
లొంగని మీ పరువాలు లొంగ దీసుకుంటా
అందాలకు బందమేసి అదుపులోన పెడతా..
అదుపులోన పెడతా . . .
గుడుగుడు గుంచం గుళ్ళో రాగం
పాముల పట్నం... పటికి బెల్లం..
నేనే పెళ్ళి చేస్తా.. మీ అందరికీ
నేనే చేస్తా... నేనే చేస్తా...
నేనే చేస్తా... నేనే పెళ్ళి చేస్తా
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి