RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, ఫిబ్రవరి 2025, మంగళవారం

ధీవరా ప్రసర శౌర్య భార | Dheevara Prasara Shourya Bhara | Song Lyrics | Bahubali (2015)

ధీవరా ప్రసర శౌర్య భార 



చిత్రం : బాహుబలి (2015)

సంగీతం : ఎం ఎం కీరవాణి 

గీతరచయిత : రామజోగయ్య శాస్త్రి 

నేపధ్య గానం : దీపు, రమ్య బెహెర 



హోనన హున్నానా హున్నానా 

హోన నచ్చానా

హోనన హున్నానా హున్నానా 

హోన అంతగానా

అందని లోకపు చంద్రికనై 

ఆహ్వానిస్తున్నా


అల్లరి ఆశల అభిసారికనై 

నీకై చూస్తున్నా


ధీవరా.. ప్రసర శౌర్య భార..

ఉత్సరా..  స్థిర గంభీర..

ధీవరా.. ప్రసర శౌర్య భార..

ఉత్సరా..  స్థిర గంభీర..


అలసినా.. సొలసినా.. 

ఒడిలో నిన్ను లాలించనా..

అడుగునై.. నడపనా.. 

నీ జంట పయనించనా..


పడి పడి తలపడి

వడి వడి త్వరపడి వస్తున్నా 

ఏదేమైనా

సిగముని విడిచిన శిఖరపు 

జలసిరి ధారల్ని

జటాజూటంలా ఢీకొని

సవాలని తెగించి నీ వైపు 

దూసుకొస్తున్నా!


ఉగ్రమా..  అసమ శౌర్య భావ

రౌద్రమా.. నవ భీతిర్మ

ఉగ్రమా..  అసమ శౌర్య భావ

రౌద్రమా.. నవ భీతిర్మ


నిలువునా ఎదగరా 

నిన్ను రమ్మంది నా తొందర

కదలికే కదనమై 

గగనానికెదురీదరా


విజితరి పురు ధిరధారా! 

కలిత అసిధర కఠోరా!

కులకు ధర  తులిత గంభీరా! 

జయ విరాట్వీర!

విలయ గగనతల 

భీకర గర్జ్జద్ధారాధరా!

హృదయ రస కాసారా! 

విజిత మధు పారాహార!


భయకరంశౌ విభవసింధు

సుపరదంగం భరణరంధీ

భయకరంశౌ విభవసింధు

సుపరదంగం భరణరంధీ

భయకరంశౌ విభవసింధు

సుపరదంగం భరణరంధీ


ధీవరా.. ప్రసర శౌర్య భార..

ఉత్సరా..  స్థిర గంభీర..

ధీవరా.. ప్రసర శౌర్య భార..

ఉత్సరా..  స్థిర గంభీర..


ధీవరా! దరికి చేరరారా!

సుందర! చెలి నీదేరా!

ధీవరా! దరికి చేరరారా!

సుందర! చెలి నీదేరా!


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వరములు ఏడైనా రాగాలెన్నో | Swaramulu Yedaina Ragalenno | Song Lyrics | Toorpu Padamara (1976)

స్వరములు ఏడైనా రాగాలెన్నో చిత్రం: తూర్పు పడమర (1976) సంగీతం: రమేశ్ నాయుడు గీతరచయిత: సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం: పి.సుశీల  పల్లవి: స్వరములు...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు