అనురాగముతో నిండిన నదిలా
సీతారాముల ప్రేమ కధ
రచన : రామకృష్ణ దువ్వు
పల్లవి:
అనురాగముతో
నిండిన నదిలా
కోకిల పాటల
కిలకిల రావాలూ
గగనము నిండిన
పన్నీటి మొయిలా
ఇలపై ప్రేమకు ఒక
ఒరవడిగా
సీతా రాముల ప్రేమ
కథ అమరముగా
సీతా రాముల ప్రేమ కథ అమరముగా
చరణం 1:
రాముని చూపులో
వెన్నెల కాంచగా
సీత మనమున
పరితపించుగా
బిడియపు మోమును
చూడగా
పున్నమి జాబిలి
భువిపై నిలచెనా
జానకి చెంతన
రాముని భావనా
ప్రేమ వెలుగులు
హృదయం నిండగా
చరణం 2:
కోదండమీడి రాముని
చేయి మెత్తగా
కోమలి కురులు
ముడివేయు ముచ్చటగా
సీతా రాముల
అనుబంధం కని పర్ణశాల
తరగని తలపుల
తరతరాల సాక్షిగా
జానకి రాముల
ప్రేమలు కమనీయం
చైత్ర శుద్ధ
నవమికి ప్రతియేటా కళ్యాణం
సీతా రాముల ప్రేమ కథ అమరముగా
సీతా రాముల ప్రేమ కథ అమరముగా
అనురాగముతో నిండిన నదిలా
కోకిల పాటల కిలకిల రావాలూ
గగనము నిండిన పన్నీటి మొయిలా
ఇలపై ప్రేమకు ఒక ఒరవడిగా
సీతా రాముల ప్రేమ కథ అమరముగా
సీతా రాముల ప్రేమ కథ అమరముగా
- RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి