RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, ఫిబ్రవరి 2025, సోమవారం

శివ శివ అననేలరా | Shiva Shiva ananelara | Song Lyrics | Bhakta Kannappa (1976)

శివ శివ అననేలరా



చిత్రం :  భక్త కన్నప్ప (1976)

సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం

గీతరచయిత : సి నారాయణ రెడ్డి

నేపథ్య గానం : జానకి


పల్లవి :


శివ శివ అననేలరా..

శివ శివ అననేలరా

కౌగిలిలోనే కైలాస మందగా..

కౌగిలిలో  నే  కైలాస మీయగా

శివ శివ అననేలరా 


చరణం 1 :


కొందరికేమో జన్మకో శివరాత్రి... 

ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి

కొందరికేమో జన్మకో శివరాత్రి... 

ఈ సుందరికి ప్రతిరాత్రి నవరాత్రి 


భక్తులకు బ్రతుకు గడుపగా.. 

గడుపగా.. ముక్తి

మనబోటి రక్తులకు.. 

సనిద నిదప గా మా పా

మనబోటి రక్తులకు.. 

సగమా గమద మనిద మదప

మనబోటి రక్తులకు... 

ఘడియ ఘడియకు.. ముక్తీ . . 

శివ . . శివ   

శివ శివ అననేలరా

కౌగిలిలోనే కైలాస మందగా..

కౌగిలిలో  నే  కైలాస మీయగా

శివ శివ అననేలరా  ... రా.. రా 


చరణం 2 :


టక్కరి మరుని ఉక్కడగించెను... 

నాటి ముక్కంటి చూపు

కాలిన మదనుని మేలుకొలిపెను... 

నేటి నీ కొంటె చూపు


సగము మేనిలో మగువను నిలిపిన..

సగము మేనిలో మగువను నిలిపిన... 

చంద్రధరుడు ఆ హరుడు

తనువు తనువె ఈ తరణి కొసంగిన... 

రసిక వరుడు.. ఈ హరుడు.. 

శివ.. శివ   


శివ శివ అననేలరా

కౌగిలిలోనే కైలాస మందగా..

కౌగిలిలో  నే  కైలాస మీయగా

శివ శివ అననేలరా .. 

రా.. రా..  రా


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు