చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ
చిత్రం : అందరూ దొంగలే (1974)
సంగీతం : కె. వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : మాధవపెద్ది సత్యం, బాలు
పల్లవి :
చంటిబాబు . . ఓ బుజ్జిబాబూ..
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ..
నీ పంట పండితే నవాబూ
ఉంది తాళం.. ఏది బీగం..
లేనే లేదా జవాబూ ?
ఉంది తాళం.. ఏది బీగం..
లేనే లేదా జవాబూ ?
మంచి ఖజానా.. మనకు ఠికానా
నిధి దొరికేనా... నీకు బజానా
దారిన బోయే చక్కని దానా..
బాగున్నానా.. నీ పక్కకు రానా
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ..
నీ పంట పండితే నవాబూ
చరణం 1 :
దారిలోన మాకు చిక్కిందీ లక్కీ నాడా..
చిన్నదాన నువు చెప్పాలి గుర్రపు జాడా
దారిలోన మాకు చిక్కిందీ లక్కీ నాడా..
చిన్నదాన నువు చెప్పాలి గుర్రపు జాడా
వెదకాలీ దీనికి జోడి.. వెదకాలీ దీనికి జోడి..
అది చూపవె ఓ వగలాడీ
ఒప్పులకుప్ప.. చెపితే తప్పా..
కంటికి రెప్ప.. ముత్యపు చిప్ప
ఎక్కడ ఉందా తాళ కప్ప..
చోటు చెప్పు.. చిక్కు ముడి విప్పు
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ...
నీ పంట పండితే నవాబూ
చరణం 2 :
పద నాన్నా.. మన రాత బండి సున్నా !
అచ్చుబోసి సాగనంపింది అత్తారిల్లు..
అంతలోనే ఇది దొరికింది ఫలితం నిల్లు
అచ్చుబోసి సాగనంపింది అత్తారిల్లు..
అంతలోనే ఇది దొరికింది ఫలితం నిల్లు
గతిఏదని నిన్నడిగేము..
గతిఏదని నిన్నడిగేము..
అది చెపితే నీకు సలాము
నీ గులాము మేమవుతాము..
నువ్వడిగింది చేసేస్తాము
రోజు రోజూ సేవిస్తాము..
చెప్పు గుట్టూ.. నారి చూపెట్టు
పద నాన్నా.. మన రాత బండి సున్నా
ఏడుకొండలవాడా ! వెంకటరమణా!
ఆపద మొక్కులవాడా ! నువ్వే శరణు
ఓ స్వామీ ! మాకు ఇచ్చావు నువ్వో తాళం..
అంతర్యామీ కాని చేశావు మాయాజాలం
ఓ స్వామీ ! మాకు ఇచ్చావు నువ్వో తాళం..
అంతర్యామీ కాని చేశావు మాయాజాలం
చూపిస్తే సొమ్ముల మూట..
చూపిస్తే సొమ్ముల మూట..
మేమిస్తాం నీకో వాటా
మా ఈ నోట.. రాదులె జూటా..
ఆడిన మాట.. అగ్గిబరాటా..
ఒద్దు గలాటా
చూపుము బాటా.. ఆశలేదా..
నీకు డబ్బు చేదా
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ..
నీ పంట పండితే నవాబు
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ..
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ !
చంటిబాబు.. ఓ బుజ్జిబాబూ !
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి