RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, ఫిబ్రవరి 2025, గురువారం

చందమామ రమ్మంది చూడూ | Chandamama Rammandi Chudu | Song Lyrics | Amayakudu (1968)

చందమామ రమ్మంది చూడూ



చిత్రం: అమాయకుడు (1968)

సంగీతం: బి. శంకర్

గీతరచయిత: సి నారాయణ రెడ్డి

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


చందమామ రమ్మంది చూడు.. 

చల్లగాలి రమ్మంది చూడూ..

ఆ పైన.. ఇంక ఆ పైన.. 

నువ్వు నా కళ్ళలో తొంగి చూడూ


చందమామ బాగుంది నేడు.. 

చల్లగాలి బాగుంది నేడు

ఏముంది.. ఇంక ఏముంది.. 

అది అంతే కదా ఏనాడు

చందమామ బాగుంది నేడు


చరణం 1:


పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు

పూవులే ఎందుకో నవ్వుతున్నాయి చూడు

వెన్నెలే ఎందుకో నన్ను కవ్వించే నేడు

తెలుసుకోలేవు నీవూ.. పలకగాలేను నేను


చందమామ రమ్మంది చూడూ


చరణం 2:


పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు

పూవులే నవ్వితే నవ్వుకోనిమ్ము నేడు

ఉందిగా వెన్నెలా ఎందుకమ్మాయి తోడు

నీది నా దారి కాదు.. నాది నీ దారి కాదు


చందమామ బాగుంది నేడు


చరణం 3 :


చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు

చెంతగా నిలిచినా ఇంత గిలిగింత లేదు

చెంతగా నిలిచినా వింత నాకేమి లేదు

అడవి మనిషివి నీవు.. 

ఆ మాటే తగదన్నాను


చందమామ రమ్మంది చూడు.. 

చల్లగాలి రమ్మంది చూడు

ఆ పైన.. ఇంక ఆ పైన.. 

నువ్వు నా కళ్ళలో తొంగి చూడు

చందమామ రమ్మంది చూడు


- పాటల ధనుస్సు



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు