ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ
రచన : రామకృష్ణ దువ్వు
పల్లవి:
ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ
ఎట్టెట్టో కైలాసమట నువ్వట్టే వుంటావట
శివయ్యా …
అదెట్టో మరి మాకట్టాలు గట్టెక్కేందుకు
చుట్టమల్లే మా చుట్టే వుంటావట
శివయ్యా…
ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ
చరణం 1:
మూడుకన్నులున్న గాని మూసుకొనే వుంటావట
ధ్యాన ముద్రలోనే నీవు జగాలన్నీ సూత్తావంట
చిన్న చీమకుట్టినంతనే కైలాసానికంపేవట
కన్నబిడ్డలల్లె మమ్ము కాచుకొంటూ వుంటావట
ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ
చరణం 2:
ఆకలేస్తే నీవు జోలెకట్టి ఆలిమెట్టు తొక్కేవట
ఆకలంటే తెలీకుండా మమ్ము సూత్తావంట
ఆనె తోలు తోటేనీవు వళ్ళుకప్పుకునేవంట
పట్టుబట్టలెట్టి మాకు పట్టమే కట్టేవట
ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ
చరణం 3:
ఇల్లువాకిలే లేక కొండలంట వుండేవట
బంగళాలలోన మమ్ము చల్లగా వుంచేవట
హాలాహలమనే విషము నువ్వు సేవించేవట
రోగమేమి రాకుండా మాకమృతాలు ఇచ్చేవట
ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ
- RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి