అనుభవించు రాజా
చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు
పల్లవి :
హ... హ.. హ... హ... హ.. హ...
హ... హ.. హ... హ... హ.. హ...
అనుభవించు రాజా...
అనుభవించు రాజా
పుట్టింది పెరిగింది..
పుట్టింది పెరిగింది..
ఎందుకూ అందుకే
అనుభవించు రాజా...
అనుభవించు రాజా
చరణం 1 :
మనం కో అంటే కొండలే
ఓహొ అంటాయి
మనం కో అంటే కొండలే
ఓహొ అంటాయి
మనం రమ్మంటే మబ్బులే
దిగిదిగి వస్తాయీ
మనం రమ్మంటే మబ్బులే
దిగిదిగి వస్తాయీ
మనం అలికిడి వి౦టే
పులులైనా హడలిపోతాయి
మనం అలికిడి వి౦టే
పులులైనా హడలిపోతాయి
మన పేరంటేనే ఏ తలలైనా
సలాము చేస్తాయి.. హ..
గులాములువుతాయి
అనుభవించు రాజా..
అనుభవించు రాజా
చరణం 2 :
ఏడ్చేవాళ్ళను నమ్మకు
నవ్వేవాళ్ళను ఆపకు
ఏడ్చేవాళ్ళను నమ్మకు
నవ్వేవాళ్ళను ఆపకు
ఎవడేమన్నా ఏదేమయినా
పట్టిన పట్టు విడవకూ
ఉన్నవాళ్ళమే లేకుంటే
లేనివాళ్ళకు దిక్కేది
ఉన్నవాళ్ళమే లేకుంటే
లేనివాళ్ళకు దిక్కేది
పెట్టి పుట్టిన వాళ్ళకే
ఈ దర్జాలన్నీ దక్కెది..
అందుకే మనం అనుభువించేది
అనుభవించు రాజా
అనుభవించు రాజా..
పుట్టింది పెరిగింది..
పుట్టింది పెరిగింది..
ఎందుకూ అందుకే
అనుభవించు రాజా...
అనుభవించు రాజా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి