RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
manushulantha okkate లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
manushulantha okkate లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2025, శనివారం

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా | Mutyalu Vastava | Song Lyrics | Manushulantha Okkate (1976)

ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా



చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : కొసరాజు

నేపధ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. 

ఊర్వశిలా ఇటు రావే వయారీ

ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. 

ఊర్వశిలా ఇటు రావే వయారీ 


చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను

చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను.. 

తొందరపడితే లాభం లేదయో


చరణం 1 :


నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ... 

నీ కొంటే చూపు కోరికేస్తు ఉందీ

నీ జారు ఫైట ఊరిస్తు ఉందీ.. 

నీ కొంటే చూపు కోరికేస్తు ఉందీ.. 

కన్నూ కన్నూ ఎపుడో కలిసిందీ 


ఏదయ్యగోల.. సిగ్గేమి లేదా.. 

ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా

ఏదయ్యగోల.. సిగ్గేమి లేదా.. 

ఊరోళ్ళు వింటే ఎగతాళి గాదా.. 

నిన్నూ నన్నూ చూస్తే నామరదా


ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. 

ఊర్వశిలా ఇటు రావే వయారీ 


చరణం 2 :


పరిమినెంటుగాను నిన్ను చేసుకొంటాను.. 

ఉన్నదంత ఇచ్చెసి నిన్ను చూసుకుంటాను

ఇంటా బయటా పట్టుకునుంటానూ..  

అహా... ఒహో.. ఏహే.. ఏ.. 


ఏరుదాటిపోయాక తెప్ప తగల ఏస్తేను.. 

ఊరంతా తెలిసాక వదలి పెట్టి పోతేను

బండకేసి నిను బాదేస్తానయ్యో..  

రేవులోన నిను ముంచేస్తానయ్యో  


ముత్యాలు వస్తావా.. అడిగింది ఇస్తావా.. 

ఊర్వశిలా ఇటు రావే వయారీ

చలమయ్య వస్తాను.. ఆ ఫైన చూస్తాను.. 

తొందరపడితే లాభం లేదయో


- పాటల ధనుస్సు 


నిన్నే పెళ్లాడుతా | Ninne Pelladutha | Song Lyrics | Manushulantha Okkate (1976)

నిన్నే పెళ్లాడుతా


చిత్రం  :  మనుషులంతా ఒక్కటే (1976)

సంగీతం  :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత  :  దాసరి నారాయణరావు 

నేపధ్య గానం  :  సుశీల  


పల్లవి :


నిన్నే పెళ్లాడుతా.. 

నిన్నే పెళ్ళాడుతా

రాముడు.. భీముడు.. 

రాముని మించిన రాముడు


పిడుగు రాముడు.. 

అగ్గి రాముడు.. 

టైగర్ రాముడు.. 

శభాష్ రాముడు


నిన్నే పెళ్ళాడుతా.. 

రాముడు..భీముడు.. 

రాముని మించిన రాముడు

పిడుగు రాముడు.. 

అగ్గి రాముడు.. 

టైగర్ రాముడు.. 

శభాష్ రాముడు.. 

నిన్నే పెళ్ళాడుతా


చరణం 1 :


శాంత.. రామ.. వివాహబంధం..  

సీతారామ కళ్యాణ౦

శాంత.. రామ.. వివాహబంధం..  

సీతారామ కళ్యాణ౦


ఇంటికి దీపం ఇల్లాలే.. 

ఇంటికి దీపం ఇల్లాలే.. 

కలసి ఉంటే కలదు సుఖం


నిప్పులాంటి మనిషి.. 

ఎదురులేని మనిషి.. 

ఆత్మబందువే.. అగ్గిబరాటా.. 

ఆత్మబందువే.. అగ్గిబరాటా

చిక్కడు దొరకడు.. 

కదలడు వదలడు.. 

నిన్నే పెళ్ళాడుతా


చరణం 2 :


జగదేక వీరుని మంగళసూత్ర౦.. 

ఈ ఆడబ్రతుకున కంచుకోట

జగదేక వీరుని మంగళసూత్ర౦.. 

ఈ ఆడబ్రతుకున కంచుకోట


దాసిని.. చరణదాసిని.. 

దాసిని.. చరణదాసిని

భీష్మా.. కాదా మంగమ్మ శపధం

భీష్మా.. కాదా మంగమ్మ శపధం

దేషోద్దారకా.. కథానాయకా.. 

దేవా౦తక...  జయసింహా

వీర కంకణ౦.. నా సంకల్పం.. 

దాన.. వీర.. శూర.. కర్ణా.. నిన్నే


నిన్నే పెళ్ళాడుతా.. 

రాముడు.. భీముడు.. 

రాముని మించిన రాముడు

పిడుగు రాముడు.. 

అగ్గి రాముడు.. 

టైగర్ రాముడు.. 

శభాష్ రాముడు.. 

నిన్నే పెళ్ళాడుతా


- పాటల ధనుస్సు 


తాతా బాగున్నావా | Tata Bagunnava | Song Lyrics | Manushulantha Okkate (1976)

తాతా.. బాగున్నావా



చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి నారాయణ రెడ్డి  

నేపధ్య గానం : బాలు   


పల్లవి :


తాతా.. బాగున్నావా.. 

ఏం తాతా బాగున్నావా

తాతా..  బాగున్నావా.. 

ఏం తాతా బాగున్నావా

కంగారుగున్నావు ఖంగుతింటున్నావు..

కంగారుగున్నావు ఖంగుతింటున్నావు


ముడుచుకొనున్నావు మూలకూర్చొన్నావు.. 

తాత

కంగారు గున్నావు ఖంగుతింటున్నావు..

కంగారు గున్నావు ఖంగుతింటున్నావు

తాతా.. బాగున్నావా..  

ఏం తాతా బాగున్నావా


చరణం 1 :


మీసాలు మెలివేస్తే వేళ్ళు నోప్పెడతాయి

కస్సు బుస్సు మని చూస్తే కళ్ళేర్ర బడతాయి

మీసాలు మెలి వేస్తే వేళ్ళు నోప్పెడతాయి

కస్సు బుస్సు మని చూస్తే కళ్ళేర్ర బడతాయి


విసురగ నడిచినచో కాలుజారి పడతావు

విసురగ నడిచినచో కాలుజారి పడతావు

చేసినదానికి చెంపలేసుకొని.. 

వచ్చేయి మాదారి లేకుంటే గోదారి 


తాతా.. బాగున్నావా..  

ఏం తాతా బాగున్నావా


చరణం 2 :


రాముడ్ని ఎదిరి౦చి రావణుడేమయ్యాడు..

కృష్ణుడ్ని అదిలించి కంసుడు ఏమయ్యాడు

రాముడ్ని ఎదిరి౦చి రావణుడేమయ్యాడు..

కృష్ణుడ్ని అదిలించి కంసుడు ఏమయ్యాడు


నీ కంటే గొప్పోళ్ళు నీళ్ళుగారి పోయారు..

నీ కంటే గొప్పోళ్ళు నీళ్ళుగారి పోయారు

నీకున్న పరువె౦త నీకున్న బలమెంత..

మా దండు కదిలిందా నీ పని గోవిందా 


తాతా.. బాగున్నావా.. 

ఏం తాతా బాగున్నావా


చరణం 3 :


నా అంతు చూస్తానని రంకెలు వేశావే.. 

ఊరంత నాదేనని విర్రవీగి పోయావే

నా అంతు చూస్తానని రంకెలు వేశావే..  

ఊరంత నాదేనని విర్రవీగి పోయావే


వచ్చాను మొనగాణ్ణి వరుసకు మనవడ్ని

వచ్చాను మొనగాణ్ణి వరుసకు మనవడ్ని

తాతకు దగ్గులు నేర్పే దాకా నిద్దురపోను.. 

నిన్నోదిలిపోను 


తాతా.. బాగున్నావా.. 

ఏం తాతా బాగున్నావా

తాతా..  బాగున్నావా..  

ఏం తాతా బాగున్నావా..  

తా తా తా తా తా


-  పాటల ధనుస్సు 



అనుభవించు రాజా | Anubhavinchu Raja | Song Lyrics | Manushulantha Okkate (1976)

అనుభవించు రాజా

చిత్రం : మనుషులంతా ఒక్కటే (1976)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : బాలు   


పల్లవి :


హ... హ.. హ... హ... హ.. హ...

హ... హ.. హ... హ... హ.. హ... 


అనుభవించు రాజా...  

అనుభవించు రాజా

పుట్టింది పెరిగింది..

పుట్టింది పెరిగింది..  

ఎందుకూ అందుకే

అనుభవించు రాజా... 

అనుభవించు రాజా


చరణం 1 :


మనం కో అంటే కొండలే 

ఓహొ అంటాయి

మనం కో అంటే కొండలే 

ఓహొ అంటాయి 


మనం రమ్మంటే మబ్బులే 

దిగిదిగి వస్తాయీ

మనం రమ్మంటే మబ్బులే 

దిగిదిగి వస్తాయీ 


మనం అలికిడి వి౦టే 

పులులైనా హడలిపోతాయి

మనం అలికిడి వి౦టే 

పులులైనా హడలిపోతాయి

మన పేరంటేనే ఏ తలలైనా 

సలాము చేస్తాయి.. హ.. 

గులాములువుతాయి

 అనుభవించు రాజా.. 

అనుభవించు రాజా


చరణం 2 :


ఏడ్చేవాళ్ళను నమ్మకు 

నవ్వేవాళ్ళను ఆపకు

ఏడ్చేవాళ్ళను నమ్మకు 

నవ్వేవాళ్ళను ఆపకు

ఎవడేమన్నా ఏదేమయినా 

పట్టిన పట్టు విడవకూ


ఉన్నవాళ్ళమే లేకుంటే 

లేనివాళ్ళకు దిక్కేది

ఉన్నవాళ్ళమే లేకుంటే 

లేనివాళ్ళకు దిక్కేది

పెట్టి పుట్టిన వాళ్ళకే 

ఈ దర్జాలన్నీ దక్కెది..

అందుకే మనం అనుభువించేది 

 అనుభవించు రాజా 

అనుభవించు రాజా..

పుట్టింది పెరిగింది.. 

పుట్టింది పెరిగింది..  

ఎందుకూ అందుకే

అనుభవించు రాజా... 

అనుభవించు రాజా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు