నిన్నే పెళ్లాడుతా
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : దాసరి నారాయణరావు
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
నిన్నే పెళ్లాడుతా..
నిన్నే పెళ్ళాడుతా
రాముడు.. భీముడు..
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..
అగ్గి రాముడు..
టైగర్ రాముడు..
శభాష్ రాముడు
నిన్నే పెళ్ళాడుతా..
రాముడు..భీముడు..
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..
అగ్గి రాముడు..
టైగర్ రాముడు..
శభాష్ రాముడు..
నిన్నే పెళ్ళాడుతా
చరణం 1 :
శాంత.. రామ.. వివాహబంధం..
సీతారామ కళ్యాణ౦
శాంత.. రామ.. వివాహబంధం..
సీతారామ కళ్యాణ౦
ఇంటికి దీపం ఇల్లాలే..
ఇంటికి దీపం ఇల్లాలే..
కలసి ఉంటే కలదు సుఖం
నిప్పులాంటి మనిషి..
ఎదురులేని మనిషి..
ఆత్మబందువే.. అగ్గిబరాటా..
ఆత్మబందువే.. అగ్గిబరాటా
చిక్కడు దొరకడు..
కదలడు వదలడు..
నిన్నే పెళ్ళాడుతా
చరణం 2 :
జగదేక వీరుని మంగళసూత్ర౦..
ఈ ఆడబ్రతుకున కంచుకోట
జగదేక వీరుని మంగళసూత్ర౦..
ఈ ఆడబ్రతుకున కంచుకోట
దాసిని.. చరణదాసిని..
దాసిని.. చరణదాసిని
భీష్మా.. కాదా మంగమ్మ శపధం
భీష్మా.. కాదా మంగమ్మ శపధం
దేషోద్దారకా.. కథానాయకా..
దేవా౦తక... జయసింహా
వీర కంకణ౦.. నా సంకల్పం..
దాన.. వీర.. శూర.. కర్ణా.. నిన్నే
నిన్నే పెళ్ళాడుతా..
రాముడు.. భీముడు..
రాముని మించిన రాముడు
పిడుగు రాముడు..
అగ్గి రాముడు..
టైగర్ రాముడు..
శభాష్ రాముడు..
నిన్నే పెళ్ళాడుతా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి