సోమ మంగళ బుధ
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సుంకర సత్యనారాయణ
నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి, బాలు
పల్లవి :
సోమ.. మంగళ.. బుధ..
గురు.. శుక్ర.. శని.. ఆది
సోమ.. మంగళ.. బుధ..
గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది..
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది
సోమ.. మంగళ.. బుధ..
గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది..
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది
చరణం 1 :
పెంచేదెట్లా గంపెడుమంద..
పెట్టలేక మనపని గోవింద..
పెట్టలేక మనపని గోవింద
కలిగిన చాలును వొకరూ ఇద్దరూ..
కాకుంటె ఇంకొక్కరు..
కాకుంటె ఇంకొక్కరూ
సోమ.. మంగళ.. బుధ..
గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది..
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది
చరణం 2 :
కాదు.. కాదు.. కాదు....
వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు..
కనవలసిందే ఎందరైనా
బుద్దుడో.. జవహరో.. గాంధీజీ..
కాకూడదా ఇందెవడైనా
ఔతారౌతారౌతారు..
బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె
ఔతారౌతారౌతారు..
బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు
లౌతారౌతారౌతారు..
తిండికి గుడ్డకు కరువై..
కడుపుమండి విషంతిని చస్తారూ
సోమ.. మంగళ.. బుధ..
గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది..
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది
చరణం 3 :
ఎగిరే పక్షికి ఎవడాధారం..
పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
ఎగిరే పక్షికి ఎవడాధారం..
పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
దారి చూపు నందరికీ వాడే..
దారి చూపు నందరికీ వాడే
నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ
ఎవరికివారే ఇట్లనుకుంటే..
ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం..
ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
కనాలందుకే మిత సంతానం..
కావాలిది అందరికి ఆదర్శం
అయ్యా.. అయ్యా.. ఎందుకు గొయ్య..
నాకొక పీడర మీతాతయ్య
చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య
బాబూ.. బాబూ.. నీకెందుకురా ఆ గొయ్య
నీ అయ్యకు చేసే ఈ మర్యాద..
రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు మనవడేగా..
ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . .
ఒకటేగా?
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి