RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rajababu songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rajababu songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, సెప్టెంబర్ 2026, శనివారం

వినరా సూరమ్మ కూతురి మొగుడా | Vinara Suramma Kuturi Moguda | Song Lyircs | Illu Illalu (1972)

వినరా సూరమ్మ కూతురి మొగుడా 


చిత్రం: ఇల్లు ఇల్లాలు (1972)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: కొడకండ్ల అప్పలాచార్య

గానం: ఎస్. జానకి, రాజబాబు


పల్లవి:


వినరా సూరమ్మ కూతురి మొగుడా...

విషయము చెపుతానూ 

అసలు విషయము చెపుతానూ

వినరా సూరమ్మ కూతురి మొగుడా...

విషయము చెపుతానూ 

అసలు విషయము చెపుతానూ

చెప్పు మలీ


చరణం: 1


కారు మబ్బులూ కమ్మిన వేళా...

కాకులు గూటికి చేరే వేళ...కా..కా...


చందమామ తొంగి చూసేవేళా ...

సన్నజాజులు పూసే వేళ ..

అహా...ఓహో...

ఒంటిగ నేనూ ఇంట్లో ఉంటే..

ఉయ్యాల ఎక్కీ ఊగుతు ఉంటే

లాలీ లాలీ లాలీ లలీ లాలీ 

లాలీ లాలీ లలీ లో...


ఏం జలిగింది...


తలుపు కిర్రునా చప్పుడైనది

గుండె ఝల్లునా కొట్టుకున్నది

తలుపు కిర్రునా చప్పుడైనది

గుండె ఝల్లునా కొట్టుకున్నది

మెల్ల మెల్లగా కళ్ళు తెరచి

నే వచ్చినదెవరో చూశాను


ఎవలాలూ...

నల్లనివాడు గుంట కన్నూల వాడు

గుబురుమీసాల వాడు అయ్యబాబోయ్

ఆరడుగుల పొడుగు వాడు

ముద్దులిమ్మని నన్ను అడిగినాడు

ఏయ్ వాన్ని నే నలికేస్తాను


చరణం: 2


నేనివ్వ నేనివ్వ రానివ్వనంటూ 

మొగముదాచుకొన్నా

పోనివ్వ పోనివ్వ ముద్దివ్వమంటూ 

జడను లాగినాడూ

అమ్మా... నాన్నా....

అమ్మా నాన్నా కాపాడమంటూ 

అల్లాడిపోయాను

అయినా కానీ వదలక నన్ను 

ఒడిసిపట్టినాడు


అంతలో వచ్చింది

ఏమిటీ మూల్చా

కాదు మా అమ్మ

వచ్చి ఏమంది?


వెళ్ళవే నాతల్లి వెళ్ళవే అమ్మా

ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు

మంచి బట్టలిస్తాడు డబ్బులిస్తాడు

మంచి బట్టలిస్తాడు అని 

ముందుకి తోసింది


ఛీ అది తల్లా కాదు లాక్షసి 

పిచాచి దెయ్యం 

తరవాతేమయిందో చెప్పు ...


చరణం: 3


తప్పనిసరియై వెళ్ళేను 

సిగ్గుపడుతు నిలుచున్నాను

గదిలోకెత్తుకు పోయేడు 

కథలూ కబుర్లు చెప్పేడు...

తన దుప్పటిలో చోటిచ్చేడు


ఛీ.. కులటా పాపాత్ములాలా 

నువ్వు నాకొద్దు ఫో.. 

వాడిదగ్గిరికే పో...


అంతకోపం ఎందుకయ్యా 

అప్పుడు నావయసైదయ్య

ఏంటీ నీ ఆప్పుడు కైదేల్లా....

అంత కోపం ఎందుకయ్యా 

అప్పుడు నావయసైదయ్యా

ఆ వచ్చినదీ మా తాతయ్య

తాతయ్య తాతయ్య.

తాతయ్య తకతయ్యా

తాతయ్య తకయ్య

తాతయ్యా నేనికా 

ఎవలో అనుకున్నా


- పాటల ధనుస్సు


27, మార్చి 2025, గురువారం

సోమ మంగళ బుధ | Soma Mangala Budha | Song Lyrics | Tata Manavadu (1973)

సోమ మంగళ బుధ


చిత్రం :  తాతా మనవడు (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సుంకర సత్యనారాయణ

నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి, బాలు


పల్లవి :


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది   


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది    


చరణం 1 :


పెంచేదెట్లా గంపెడుమంద..

పెట్టలేక మనపని గోవింద.. 

పెట్టలేక మనపని గోవింద

కలిగిన చాలును వొకరూ ఇద్దరూ..

కాకుంటె ఇంకొక్కరు.. 

కాకుంటె ఇంకొక్కరూ


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 


చరణం 2 : 


కాదు.. కాదు.. కాదు.... 

వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. 

కనవలసిందే ఎందరైనా

బుద్దుడో.. జవహరో..  గాంధీజీ.. 

కాకూడదా ఇందెవడైనా

ఔతారౌతారౌతారు.. 

బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె

ఔతారౌతారౌతారు.. 

బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు

లౌతారౌతారౌతారు..  

తిండికి గుడ్డకు కరువై.. 

కడుపుమండి విషంతిని చస్తారూ


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 


చరణం 3 : 


ఎగిరే పక్షికి ఎవడాధారం.. 

పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం

ఎగిరే పక్షికి ఎవడాధారం.. 

పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం

దారి చూపు నందరికీ వాడే.. 

దారి చూపు నందరికీ వాడే

నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ


ఎవరికివారే ఇట్లనుకుంటే..  

ఏమైపోవును మనదేశం

ఎప్పుడు తీరును దారిద్ర్యం..  

ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం

కనాలందుకే మిత సంతానం.. 

కావాలిది అందరికి ఆదర్శం


అయ్యా..  అయ్యా.. ఎందుకు గొయ్య.. 

నాకొక పీడర మీతాతయ్య

చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య


బాబూ..  బాబూ..  నీకెందుకురా ఆ గొయ్య

నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. 

రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా

తాతకు వారసుడు మనవడేగా.. 

ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . 

ఒకటేగా?


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు