RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
lr eswari songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
lr eswari songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, అక్టోబర్ 2026, శుక్రవారం

కలికి ముత్యాల కొలికి | Kaliki Mutyala Koliki | Song Lyrics | Tulasi (1974)

కలికి ముత్యాల కొలికి 


చిత్రం: తులసి (1974)

సంగీతం: ఘంటసాల

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:


కలికి ముత్యాల కొలికి.. 

పడకమ్మ ఉలికి ఉలికి...

కలికి ముత్యాల కొలికి.. 

పడకమ్మ ఉలికి ఉలికి...


ఆడబిడ్దంటే అర్ధమొగుడని 

అన్నావే... ఏ..ఏ..

మరి తీరా వస్తే... 

చల్లగా జారుకున్నావే..


మాట వరసకు 

అన్నాను గానీ ఓయమ్మో...

నువు అన్నంత 

చేస్తావనుకోలేదే గున్నమ్మో...

కలికి ముత్యాల కొలికి.. 

పడకమ్మ ఉలికి ఉలికి...


చరణం: 1


కోటేరు ముక్కుంది... 

కోటంత ఎత్తుంది...

మీసమంటు లేదు గానీ... 

పౌరుషం భలేగుందీ...

అందుకే నిను మెచ్చాను... 

ఒంటిగా ఇటు వచ్చాను...

హరి హరి నారాయణా... 

చచ్చాను... బాబోయ్ చచ్చాను...


కలికి ముత్యాల కొలికి... 

పడకమ్మ ఉలికి ఉలికి...

కలికి ముత్యాల కొలికి... 

రాకమ్మ ఉరికి ఉరికి..


చరణం: 2


ఆనాడు రాధగా 

నీ మేను తాకగా...

నిలువెల్ల కలిగింది 

గిలిగింత వెచ్చగా...

నిదరే రాదాయే....

గుండెలో బాధాయే...

శివ శివ ... నీ వాలకం 

శృతిమించిపోయే....

మించిపోయే...


కలికి ముత్యాల కొలికి...

పడకమ్మ ఉలికి ఉలికి...

ఆడబిడ్దంటే అర్ధమొగుడని 

అన్నావే...ఏ..ఏ..

మరి తీరా వస్తే...

చల్లగా జారుకున్నావే ...


మాటవరసకు 

అన్నాను కానీ ఓయమ్మో...ఓ...

నువు అన్నంత 

చేస్తావనుకోలేదు గున్నమ్మో...


కలికి ముత్యాల కొలికి...

పడకమ్మ ఉలికి ఉలికి...

పడకమ్మ ఉలికి ఉలికి....

రాకమ్మ ఉరికి ఉరికి...


- పాటల ధనుస్సు


20, అక్టోబర్ 2026, మంగళవారం

చూడు చూడు చూడూ | Chudu Chudu Chudu | Song Lyrics | Inspector Bharya (1970)

చూడు చూడు చూడూ 


చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: అప్పలాచార్య

గానం: ఎల్.ఆర్.ఈశ్వరి


పల్లవి :


చూడు చూడు చూడూ ... 

ఇది చూడనోడులేడు

ఒక్కసారి చూసినోడు

వదిలి పెట్టిపోడు -

చుక్కానీ సోకు చూడూ


చరణం 1:


సుందరమ్మ ఠీకు చూడు...

శ్రీకృష్ణుడి వేషంలో 

చిరునవ్వులు చిందించే

యన్. టి. రామారావు చూడు.. 

అందమైన పోజు చూడు

తులాభారం తూచలేక 

ఓరకంట చూస్తున్న

సత్యభామ జమున 

చూడు చూపులోని

సొగసుచూడు


చరణం 2:


వగలమారి వాణిశ్రీ 

వయ్యారంగా పోతుంటే

అక్కినేని అడ్డమొచ్చి 

గడ్డమట్టుకొన్నాడు

పద్మనాభ మదిచూసి 

పకాపకా నవ్వాడు

సిగ్గుపడి వాళ్ళిద్దరూ 

చెట్టుచాటు కెళ్లారు.

గూఢచారి కృష్ణ చూడు 

గురి పెట్టే స్టయిలు చూడు

విజలలిత తళకు చూడు

విజయ శ్రీ కులుకు చూడు

జ్యోతిలక్ష్మి డ్యాన్సుచూడు

డ్యాన్సులోని చాన్సు చూడు

బతికుంటే ఒక్కసారి

మదరాసుకు పోయిచూడు


- పాటల ధనుస్సు


14, అక్టోబర్ 2026, బుధవారం

నా ఒళ్ళంతా బంగారం | Naa Vallantha Bangaram | Song Lyrics | Inspector Bharya (1970)

నా ఒళ్ళంతా బంగారం 


చిత్రం: ఇన్స్పెక్టర్ భార్య (1970)

సంగీతం: కె.వి. మహదేవన్

సాహిత్యం: అప్పలాచార్య

గానం: ఎల్.ఆర్.ఈశ్వరి


పల్లవి :


నా ఒళ్ళంతా బంగారం

నీ కళ్ళు చెదిరేసింగారం

అందిస్తా నిపుడు అందుకో

ఎక్కడిదక్కడ దాచుకో

గప్ చిప్ చిప్ ...


చరణం 1:


తొలి వలపుల చలితో

గౌనుమీద గౌనేసుకున్నా

నీ చూపుల వేడికి

తాళ లేక తీరేస్తున్నా


పరులకంట పడకుండా

పరువాలు దాచివుంచా

ఈ నిషా నుందిరంలో

దిల్ ఖుషీ చేసియిస్తా....

హరే రామ రామరామ 

హరేకృష్ణ


చరణం 2:


మనిషి మనిషిలో 

మైకమున్నది.

మసక చీకటి 

మధ్యనున్నది

అ రెంటికి నడుమ 

చెలిమియున్నది

ఆ చెలిమికి తోడీ 

చెలియ వున్నది

నకిలి సరుకుకాదు

మోసం ఏమీ లేదు

గీటురాతిపై గీసి చూసుకో

సాటిలేదని నమ్మి తీసుకో

హరేరామ రామరామ-

హరేకృష్ణ

కృష్ణ కృష్ణ


- పాటల ధనుస్సు


29, సెప్టెంబర్ 2026, మంగళవారం

ఈ వేళలో నా మనసు నీదే | Eevelalo Na Manasu Neede | Song Lyrics | Srivaru Mavaru (1973)

ఈ వేళలో నా మనసు నీదే 


చిత్రం :  శ్రీవారు మావారు (1973)

సంగీతం :  జి.కె. వెంకటేశ్

గీతరచయిత :  శ్రీశ్రీ

నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి, రామకృష్ణ


పల్లవి :


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


చరణం 1 :


నేనుంటినీ నీ వెంటనే.. హైహై..

నీవుంటివీ నా కంటనే..మ్మ్ హు

నా జీవితం నీ కోసమే.. ఓహో..

నీ యవ్వనం...  నా కోసమే

నీ యవ్వనం.. నా కోసమే... హాయ్..


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


చరణం 2 :


ఆగేది కాదోయి కాలం.. 

లాగాలి లోలోని సారం

ఆగేది కాదోయి కాలం.. 

లాగాలి లోలోని సారం

నేడుంది నీ కేల రేపు.. 

జీవించు ఈ కోంత సేపు

అహా..అహా..అహా..హా..హా..హా..ఆ


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


చరణం 3 :


చేరాలి కారామసాలా.. 

ఊగాలి వేగాల ఝాలా

చేరాలి కారామసాలా.. 

ఊగాలి వేగాల ఝాలా

సాగాలి గానాబజానా.. 

తానాన తందాన తానా

లలాల..లలాల.. లలలలాలలా


ఈ వేళలో...  నా మనసు నీదే.. 

వయసు నీదే

ఈ నిషాలూ.. ఖుషీలూ నీకేలే


- పాటల ధనుస్సు


30, ఆగస్టు 2026, ఆదివారం

కొండదేవత నిన్ను కొలిచేనమ్మా | Kondadevatha Ninnu | Song Lyrics | Alluri Seetharamaraju (1974)

కొండదేవత నిన్ను కొలిచేనమ్మా


చిత్రం: అల్లూరి సీతారామరాజు (1974)

సంగీతం: పి.ఆదినారాయణ రావు

సాహిత్యం: కొసరాజు

గానం: ఎస్ పి బాలు, ఎల్.ఆర్.ఈశ్వరి


పల్లవి : 


కొండదేవత నిన్ను కొలిచేనమ్మా

కోటికోటి దండాలు ఓలమ్మా

వేయి కళ్ళతో మమ్ము సూడాలమ్మా

యెన్ను కాచి వుండాలి ఓలమ్మా

కొండదేవత నిన్ను కొలిచేనమ్మా


చరణం 1 :


పోతుగడ్జపై పుట్టామమ్మా 

విల్లంబులు చేపట్టామమ్మా

వీర కంకణం కట్టామమ్మా 

జాతి పౌరుషం నిలబెడతాం

ఏటుకొక్క తల ఎగరేస్తాం

తుపాకి గుళ్ళకు ఎదురు నిలుస్తాం

మర ఫింగులను మసి మసి చేస్తాం

మాపై దయవుంటే తల్లీ 

నింగిని నేలకు దించేస్తాం

పరాయితొత్తుల పాతేస్తాం


చరణం 2 :


భద్రాచల శ్రీ రామచంద్రుడే 

మా సీతారామరాజు

అలనాటి ఆ బాలచంద్రుడే 

మా సీతారామరాజు

మా కోయగూడెముల కొచ్చాడే, 

కొండంతబలం మా కిచ్చాడే

మా రాజుకు ఆండగ కలవాలమ్మా

పిలిచిన ఓయని పలకాలమ్మా


- పాటల ధనుస్సు


15, నవంబర్ 2025, శనివారం

నందామయా గురుడ నందామయా | Nandamaya Guruda Nandamaya | Song Lyrics | Jeevana Tarangalu (1973)

నందామయా గురుడ నందామయా



చిత్రం: జీవనతరంగాలు (1973)

సంగీతం: జె.వి. రాఘవులు

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:


ఊ...ఉహు...ఉ...

ఆ..అహ...హా...

లల..లలలా..లలల...లా..లల.లా...


నందామయా ...గురుడ నందామయా

ఉందామయా ...తెలుసుకుందామయా

నందామయా ...గురుడ నందామయా

ఉందామయా ...తెలుసుకుందామయా


చరణం 1:


మెరిసే సంఘం... మేడిపండు

దాని పొట్ట విప్పి చూస్తే... 

పురుగులుండు

మెరిసే సంఘం ...మేడిపండు

దాని పొట్ట విప్పి చూస్తే... 

పురుగులుండు


ఆ కుళ్ళు లేని చోటు ...ఇక్కడే

కుళ్ళు లేని చోటు ...ఇక్కడే ..

అనుభవించు రాజా ఇప్పుడే...


ఆనంద సారం ఇంతేనయా...

ఆనంద సారం ఇంతేనయా

ఆనంద సారం ఇంతేనయా...

ఆనంద సారం ఇంతేనయా


నందామయా ...గురుడ నందామయా

ఉందామయా ...తెలుసుకుందామయా


చరణం 2:


పుట్టినప్పుడు బట్ట కట్టలేదు...

పోయేటప్పుడు అది వెంట రాదు..

పుట్టినప్పుడు బట్ట కట్టలేదు...

పోయేటప్పుడు అది వెంట రాదు..

నడుమ బట్ట కడితే నగుబాటు

నడుమ బట్ట కడితే నగుబాటు...

నాగరీకం ముదిరితే పొరబాటు


వేదాంత సారం ఇంతేనయా...

వేదాంత సారం ఇంతేనయా

వేదాంత సారం ఇంతేనయా...

వేదాంత సారం ఇంతేనయా


నందామయా ...గురుడ నందామయా

ఉందామయా ...తెలుసుకుందామయా...

తెలుసుకుందామయా...

తెలుసుకుందామయా

తెలుసుకుందామయా...

తెలుసుకుందామయా...


- పాటల ధనుస్సు 


27, మార్చి 2025, గురువారం

సోమ మంగళ బుధ | Soma Mangala Budha | Song Lyrics | Tata Manavadu (1973)

సోమ మంగళ బుధ


చిత్రం :  తాతా మనవడు (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  సుంకర సత్యనారాయణ

నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి, బాలు


పల్లవి :


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది   


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది    


చరణం 1 :


పెంచేదెట్లా గంపెడుమంద..

పెట్టలేక మనపని గోవింద.. 

పెట్టలేక మనపని గోవింద

కలిగిన చాలును వొకరూ ఇద్దరూ..

కాకుంటె ఇంకొక్కరు.. 

కాకుంటె ఇంకొక్కరూ


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 


చరణం 2 : 


కాదు.. కాదు.. కాదు.... 

వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. 

కనవలసిందే ఎందరైనా

బుద్దుడో.. జవహరో..  గాంధీజీ.. 

కాకూడదా ఇందెవడైనా

ఔతారౌతారౌతారు.. 

బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె

ఔతారౌతారౌతారు.. 

బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు

లౌతారౌతారౌతారు..  

తిండికి గుడ్డకు కరువై.. 

కడుపుమండి విషంతిని చస్తారూ


సోమ.. మంగళ.. బుధ.. 

గురు.. శుక్ర.. శని.. ఆది

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. 

వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది 


చరణం 3 : 


ఎగిరే పక్షికి ఎవడాధారం.. 

పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం

ఎగిరే పక్షికి ఎవడాధారం.. 

పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం

దారి చూపు నందరికీ వాడే.. 

దారి చూపు నందరికీ వాడే

నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ


ఎవరికివారే ఇట్లనుకుంటే..  

ఏమైపోవును మనదేశం

ఎప్పుడు తీరును దారిద్ర్యం..  

ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం

కనాలందుకే మిత సంతానం.. 

కావాలిది అందరికి ఆదర్శం


అయ్యా..  అయ్యా.. ఎందుకు గొయ్య.. 

నాకొక పీడర మీతాతయ్య

చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య


బాబూ..  బాబూ..  నీకెందుకురా ఆ గొయ్య

నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. 

రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా

తాతకు వారసుడు మనవడేగా.. 

ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . 

ఒకటేగా?


- పాటల ధనుస్సు 


28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

మాయదారి సిన్నోడు | Mayadari Sinnodu | Song Lyrics | Amma Maata (1972)

మాయదారి సిన్నోడు



చిత్రం:  అమ్మ మాట (1972)

సంగీతం:  రమేశ్ నాయుడు

గీతరచయిత:  సి నారాయణ రెడ్డి  

నేపథ్య గానం:  ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:


మాయదారి సిన్నోడు 

మనసేలాగేసిండు

నా మనసే లాగేసిండు.. 

లగ్గమెప్పుడురా.. మాఁవా .. అంటే

మాఘమాసం ఎల్లేదాకా 

మంచిరోజు లేదన్నాడే


ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

కాఁవమ్మ సెప్పవే..  రాఁవమ్మ సెప్పవే

రత్తమ్మ సెప్పవే..  అత్తమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


మాయదారి సిన్నోడు 

మనసే లాగేసిండు

మాయదారి సిన్నోడు 

నా మనసే లాగేసిండు

మాఘమాసం ఎల్లేదాకా 

మంచిరోజు లేదన్నాడే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


చరణం 1:


సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..

సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..

సింతసెట్టెక్కీ సిగురులు కోస్తుంటే..

సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే..


సిగరుల్లో..  సిగురుల్లో..

సిగురుల్లో.. మాటేసి కన్నుగీటిండే

జివ్వున పానాలు తోడేసిండే..

ఎప్పుడ్రా మాఁవా అంటే..

సంకురాతిరి పొయ్యేదాకా.. 

మంచి గడియే లేదన్నాడే...


ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

ఎల్లమ్మ సెప్పవే.. మల్లమ్మ సెప్పవే

పుల్లమ్మ సెప్పవే.. బుల్లెమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..


చరణం 2:


ఊరి సెరువులో నే నీదులాడుతుంటే

నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే

ఊరి సెరువులో నేనీదులాడుతుంటే

నీటి నురుగుల్లో తేలి తేలి పోతుంటే...


బుడుంగున...  బుడుంగున

బుడుంగున మీదికి తేలిండే

నా తడికొంగు పట్టుకుని లాగిండే...

ఎప్పుడురా మాఁవా అంటే...

శివరాతిరి ఎల్లేదాకా 

సుబలగ్గం లేదన్నాడే...


ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా

పున్నమ్మ సెప్పవే.. గున్నమ్మ సెప్పవే

కన్నమ్మ సెప్పవే.. సిన్నమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా


చరణం 3:


కందిసేలల్లో కావలి కాసేసి

సందెకాడ ఒంటరిగా 

డొంకదారినొస్తుంటే

కందిసేలల్లో కావలి కాసేసి

సందెకాడ ఒంటరిగా 

డొంకదారినొస్తుంటే..


గబుక్కున గుబుక్కున

గబుక్కున కళ్లు రెండు మూసిండే

రివ్వున వాటేసి నవ్వేసిండే

ఏందిరా మాఁవా అంటే

కోడికూసి కూయంగానే 

తాళి కడతానన్నాడే..


ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా

అమ్మమ్మ సెప్పవే.. అయ్యమ్మ సెప్పవే

పెద్దమ్మ సెప్పవే.. పిన్నమ్మ సెప్పవే

ఆగేదెట్టాగా అందాకా ఏగేదెట్టాగా..


మాయదారి సిన్నోడు 

నా మనసే లాగేసిండు

కోడి కూసి కురియంగానే 

తాళి కడతానన్నాడే

ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా

ఆగేదెట్టాగా ఈ రాతిరి ఏగేదెట్టాగా..


- పాటల ధనుస్సు 

19, జనవరి 2025, ఆదివారం

గుడిలోన నా స్వామి | Gudilona Naa Swamy | Song Lyrics | Ida Lokam (1973)

గుడిలోన నా స్వామి



చిత్రం :  ఇదా లోకం (1973)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  వీటూరి

నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి, జానకి


పల్లవి :


గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు

సేవకు వేళాయెనే... 

చెలియా సేవకు వేళాయనే

గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు

సేవకు వేళాయెనే... 

చెలియా సేవకు వేళాయనే      

గుడియెనక నా సామి..


గుడియెనక నా సామి... 

గుర్రమెక్కి కూసున్నాడు

వాడి సోకు సూసి... 

గుండెల్లో గుబులాయెనే... 

అబ్బబ్బబ్బబ్బ

ఒళ్ళంత ఏడెక్కెనే.. 

అయ్యయ్యయ్యో

ఒళ్ళంత ఏడెక్కెనే... 

అయ్యయ్యయ్యో ఒళ్ళంత ఏడెక్కెనే


చరణం 1:


సోగ కన్నులవాడు చక్కనైనవాడు... 

సోగ కన్నులవాడు చక్కనైనవాడు

మొలక నవ్వులే నవ్వుతూ.. 

వలపు చూపులే రువ్వుతూ

సకల చరాచర జగతికి నాథుడు

నిఖిల సురాసుర ముని గణ వంధ్యుడు

నీల జలద మోహనుడు... మాధవుడు  

        

గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు.. 

సేవకు వేళాయెనే.. సేవకు వేళాయనే 


చరణం 2 :


నాల్గు కన్నులవాడు నాడెమైనవాడు...

కులుకు నవ్వులే నవ్వుతూ.. 

కొంటి చూపులే రువ్వుతూ

కులుకు నవ్వులే నవ్వుతూ.. 

కొంటి చూపులే రువ్వుతూ


కైపు మీద ఉన్నాడమ్మో.. 

కొంగు పట్టి లాగాడమ్మో

కైపు మీద ఉన్నాడమ్మో.. 

కొంగు పట్టి లాగాడమ్మో

ఎగాదిగా చూసి చూసి.. 

ఏమేమో అన్నాడమ్మో   

            

గుడియెనక నా సామి 

గుర్రమెక్కి కూసున్నాడు


చరణం 3 :


గట్టునున్న చీరలే దాచినాడమ్మా

కన్నెల మనసులే దోచినాడమ్మా.. 

కన్నెల మనసులే దోచినాడమ్మా


ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. 

ఊరుకోడమ్మా.. 

ఒంపు సొంపుల్లు దాచుకుంటే.. 

ఊరుకోడమ్మా

ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా.. 

ఒక్క రవ్వ ఊపిరైనా తీయనీడమ్మా


వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా.. 

వెన్నముద్దలు తప్ప వేరేమి తినడమ్మా


వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా.. 

వేడి ముద్దులు కోరే వన్నెకాడమ్మా


హూయ్యా... 

బంగారు ముద్దలె మింగుతాడమ్మా.. 

బంగారు ముద్దలె మింగుతాడమ్మా


పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా.. 

పడుచు పిల్ల ముద్దులంటే పడి చస్తాడమ్మా 


- పాటల ధనుస్సు


7, డిసెంబర్ 2024, శనివారం

ముద్దు ముద్దు నవ్వు | Muddu Muddu Navvu | Song Lyrics | Sattekalapu Satteyya (1969)

ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ



చిత్రం :  సత్తెకాలపు సత్తయ్య (1969)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి


పల్లవి :


ఓలలలాయి ఒలలలాయి ఒలలలలాయి... 


 ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ


చరణం 1 : 


 ఏ ఇంటి పంటవో...  ఏ తల్లి నోమువో

ఏ ఇంటి పంటవో... ఏ తల్లి నోమువో

ఈ ఒంటి వానికీ... నా వంటి పేదకూ


ఏ ఇంటి పంటవో... ఏ తల్లి నోమువో

ఈ ఒంటి వానికీ... నా వంటి పేదకూ


ప్రాణాలు పోసావు... బతకాలి అన్నావు

ఉరితాడు జోజోల ఉయ్యాల చేసావు

ఉయ్యాల చేసావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ


చరణం 2 :


 నా బాధ విన్నావు... నీ గాధ చెప్పావు

ఈ పూరి గుడిసెలో... నా బీడు మనసులో... 


నా బాధ విన్నావు... నీ గాధ చెప్పావు

ఈ పూరి గుడిసెలో... నా బీడు మనసులో... 


చిన్నారి పొన్నారి... చిగురల్లె వెలిసావు

సిరిలేదు గిరిలేదు... మనసుంటే అన్నావు..

మనసుంటే అన్నావు..


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ


ముద్దు ముద్దు నవ్వు బుగ్గల్లో రువ్వూ

జాజిమల్లె పువ్వు బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ... బజ్జోమ్మ నువ్వూ

బజ్జోమ్మ నువ్వూ... బజ్జోమ్మ నువ్వూ


- పాటల ధనుస్సు 

2, నవంబర్ 2024, శనివారం

లేలేలే నా రాజా | Lelele Naa Raja | Song Lyrics | Premanagar (1971)

లేలేలే నా రాజా



చిత్రం : ప్రేమనగర్ (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి 


పల్లవి :


లే లే లే... లేలేలే నా రాజా... 

లేలే నా రాజా

లేలేలే నా రాజా...  లేలే నా రాజా

లేవనంటావా...  

నన్ను లేపమంటావా

నిద్దుర లేవనంటావా...  

నన్ను లేపమంటావా


లే లే లే...  లేలేలే నా రాజా...  

లేలే నా రాజా


చరణం 1 :


పెటపెటలాడే పచ్చివయసు 

పై పై కొచ్చింది

వచ్చి వచ్చి...  

మెరమెరలాడే మేని నునుపు 

మెత్తగా తగిలింది

హాయ్.. పెటపెటలాడే పచ్చివయసు 

పై పై కొచ్చింది

మెరమెరలాడే మేని నునుపు 

మెత్తగా తగిలింది


మెత్తని మత్తు .. వెచ్చని ముద్దు .. 

ఒద్దిక కుదిరింది

ఇద్దరు ఉంటే ఒక్కరికేల 

నిద్దుర వస్తుంది


రా రా రా రా.. నా రోజా...  

రావే నా రోజా

రా.. నా రోజా...  రావే నా రోజా


రాతిరయ్యిందా.. హా...  

నన్ను లేచిరమ్మందా.. హా

రాతిరయ్యిందా.. హా...  

నన్ను లేచిరమ్మందా.. హా


లే లే లే లేలేలే నా రాజా... 

లేలే నా రాజా


చరణం 2 :


నల్లనల్లని కన్నులలోన 

ఎర్రని కైపుంది

ఎర్ర ఎర్రని కుర్రతనమును 

జుర్రుకుతాగాలి హహ హహ

నల్లనల్లని కన్నులలోన 

ఎర్రని కైపుంది

ఎర్ర ఎర్రని కుర్రతనమును 

జుర్రుకుతాగాలి


తాగిన రాత్రి తాగని పగలు...  

ఒక్కటి కావాలి

తాగిన రాత్రి తాగని పగలు...  

ఒక్కటి కావాలి

ఆఖరి చుక్కా.. హా.. చక్కని చుక్కా.. హా...  

అప్పుడు ఇవ్వాలి


రా రా రా రా.. నా రోజా...  

రావే నా రోజా

రా.. నా రోజా...  రావే నా రోజా

రాతిరయ్యిందా... హా ... 

నన్ను లేచిరమ్మందా..  హా

రాతిరయ్యిందా.. హా..  

నన్ను లేచిరమ్మందా..  హా

లే లే లే... లేలేలే నా రాజా...  

లేలే నా రాజా


- పాటల ధనుస్సు


28, సెప్టెంబర్ 2024, శనివారం

మసక మసక చీకటిలో | Masaka Masaka Cheekatilo | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

మసక మసక చీకటిలో



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:


మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మాపటేళకలుసుకో... 


నీ మనసైనది దొరుకుతుంది 

మనసైనది దొరుకుతుంది 

దొరుకుతుంది 


ఓకే... యా... యా యా... 

యయాయయాయా... 

యా యా... యయాయయాయా... హా... 


చరణం 1:


మా దేశం వచ్చినవాడా 

మా బొమ్మలు మెచ్చినవాడా 

మా దేశం వచ్చినవాడా 

మా బొమ్మలు మెచ్చినవాడా 


తరతరాల అందాల 

తరగని తొలి చందాల 

తరతరాల అందాల 

తరగని తొలి చందాల 

ఈ భంగిమ నచ్చిందా 

ఆనందం ఇచ్చిందా అయితే... ఏ ఏ... 


మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మాపటేళకలుసుకో... 

నీ మనసైనది దొరుకుతుంది 

మనసైనది దొరుకుతుంది 

దొరుకుతుంది 


ఓకే... యా... యా యా... 

యయాయయాయా... 

యా యా... యయాయయాయా... హా... 


చరణం 2:


చోద్యాలు వెతికేవాడా 

సొగసు చూసి మురిసేవాడా 

చోద్యాలు వెతికేవాడా 

సొగసు చూసి మురిసేవాడా 


కళ చేతికి దొరకాలంటే 

నలుమూలలు తిరగాల

కళ చేతికి దొరకాలంటే 

నలుమూలలు తిరగాల 

నీ ముందుకు రావాలా 

నీ సొంతం కావాలా అయితే... ఏ ఏ... 


మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మాపటేళ కలుసుకో... 

నీ మనసైనది దొరుకుతుంది 

మనసైనది దొరుకుతుంది 

దొరుకుతుంది 


ఓకే... యా... యా యా... 

యయాయయాయా... 

యా యా... యయాయయాయా... హా...


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు