RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
devudu chesina manushulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
devudu chesina manushulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, అక్టోబర్ 2024, మంగళవారం

తొలిసారి నిన్నూ చూశాను నేను | Tolisari Ninnu Chusanu Nenu | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

తొలిసారి నిన్నూ చూశాను నేను



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: బాలు


పల్లవి:


ఊ...ఊ...ఊ..హా..ఊ..

లా..అహా...ఆ

తొలిసారి నిన్నూ చూశాను నేను..

నీ ప్రేమ పాశం లాగింది నన్నూ..

లాగింది నన్నూ...

ఏ తారలోనూ నీ తీరూ లేదు..

ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..

లేదు..లేదు


చరణం 1:


నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి..

తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు

నీ బుగ్గమీద మొగ్గ వేయు నిగ్గు చూసి..

తాజా గులాబి సిగ్గుతో తలవంచె చూడు


ఏ తారలోనూ నీ తీరూ లేదు..

ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..

లేదు..లేదు


చరణం 2:


నీ చక్కనైన మేనులోని ఛాయ జూసీ..

చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయె నేడు


ఏ తారలోనూ నీ తీరూ లేదు..

ఏ పువ్వులోనూ నీ నవ్వు లేదు..

లేదు..లేదు..


చరణం 3:


ఏ సుందరిలో కానరాని సోయగాలు..

ఏ వయ్యారిలో లేని అందచందాలూ

ఏ సుందరిలో కానరాని సోయగాలు..

ఏ వయ్యారిలో లేని అందచందాలూ..


తనలోన కలిగి..మనసార వలచే..

చినదానికోసం వెతికేను నేను..

నేను..నేను


- పాటల ధనుస్సు


28, సెప్టెంబర్ 2024, శనివారం

దేవుడు చేసిన మనుషుల్లారా | Devudu chesina manushullara | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

దేవుడు చేసిన మనుషుల్లారా



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: శ్రీశ్రీ

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


దేవుడు చేసిన మనుషుల్లారా..

మనుషులు చేసిన దేవుళ్ళారా..

వినండి మనుషుల గోల.. 

కనండి దేవుడి లీల

వినండి మనుషుల గోల.. 

కనండి దేవుడి లీల


దేవుడు చేసిన మనుషుల్లారా..

మనుషులు చేసిన దేవుళ్ళారా..

వినండి మనుషుల గోల.. 

కనండి దేవుడి లీల

వినండి మనుషుల గోల.. 

కనండి దేవుడి లీల


గోవిందా హరిగోవిందా.. 

గోవిందా భజగోవిందా

గోవింద గోవింద హరిగోవిందా.. 

గోవింద గోవింద భజగోవిందా

గోవింద గోవింద హరిగోవిందా.. 

గోవింద గోవింద భజగోవిందా


ఆ..ఆ..ఆ..ఆ.. ఓం..


చరణం 1:


వెన్నదొంగ.. ఆ వెన్నదొంగ.. 

మా.. తొలిగురువు

మా తొలిగురువు..

తొలినుంచీ మా కులగురువు..

మా కులగురువు..

కోరిన కోరిక తీరాలంటే.. 

కోరక మోక్షం రావాలంటే

గోపాలునే సేవించాలి.. 

గోవిందునే ధ్యానించాలి


గోవిందా హరిగోవిందా.. 

గోవిందా భజగోవిందా


వినండి దేవుడి గోల 

కనండి మనుషుల లీల

దేవుడు చేసిన మనుషుల్లారా

మనుషులు చేసిన దేవుళ్ళారా

వినండి దేవుడి గోల 

కనండి మనుషుల లీల...


చరణం 2:


పేదల నెత్తురు తాల్చిన రూపం

బలిసిన జలగలు దాచిన పాపం

పేదల నెత్తురు తాల్చిన రూపం

బలిసిన జలగలు దాచిన పాపం


మానవులను పీడించే జబ్బు.. 

దేవతలను ఆడించే డబ్బు

మానవులను పీడించే జబ్బు.. 

దేవతలను ఆడించే డబ్బు


తెలుపో నలుపో జాన్ దేవ్.. 

ఆ తేడాలిక్కడ లేనేలేవ్

తెలుపో నలుపో జానేదేవ్.. 

ఆ తేడాలిక్కడ లేనేలేవ్

లేనేలేవ్..


వినండి డబ్బుల గోల 

కనండి మనుషుల లీల

వినండి డబ్బుల గోల 

కనండి మనుషుల లీల


హే.. యహా..


గాలిబుడగ జీవితం 

ఓటి పడవ యవ్వనం

గాలిబుడగ జీవితం 

ఓటి పడవ యవ్వనం


నిన్న మరల రాదు రాదు రాదు.. 

నేడే నిజం.. నేడే నిజం

నేడే నిజం..


రేపు మనది కాదు కాదు.. 

నేడే సుఖం.. నేడే సుఖం

సుఖం.. సుఖం.. నేడే సుఖం

కాసే బ్రహ్మానందం..అహా.. 

ఓ డోసే పరమానందం.. ఒహో..

ఆ.. కాసే బ్రహ్మానందం..అహా.. 

ఓ డోసే పరమానందం.. ఒహో..

ఆ.. కాసే బ్రహ్మానందం.. 

హ్మ్.. డోసే పరమానందం


ఆనందం పరమానందం.. 

ఆనందం బ్రహ్మానందం 

ఆనందం పరమానందం.. 

ఆనందం బ్రహ్మానందం 

ఆనందం పరమానందం.. 

ఆనందం బ్రహ్మానందం 

ఆనందం పరమానందం.. 

ఆనందం బ్రహ్మానందం 

ఆనందం ఆనందం 

ఆనందం ఆనందం


వినండి గ్లాసుల గోల.. 

కనండి మనుషుల లీల

వినండి గ్లాసుల గోల.. 

కనండి మనుషుల లీల


దేవుడు చేసిన మనుషుల్లారా

మనుషులు చేసిన దేవుళ్ళారా

వినండి గ్లాసుల గోల.. 

కనండి మనుషుల లీల..


చరణం 3:


ఆలయాలలో వెలుతురు లేదు.. 

ఆకాశంలో చీకటి లేదు

ఆలయాలలో వెలుతురు లేదు.. 

ఆకాశంలో చీకటి లేదు


విమానాలలో విహరిస్తుంటే 

సముద్రాలనే దాటేస్తుంటే

విమానాలలో విహరిస్తుంటే 

సముద్రాలనే దాటేస్తుంటే


గుడిలో ఎందుకు రామయ్యా.. 

నిను విడుదల చేస్తాం రావయ్యా

గుడిలో ఎందుకు రామయ్యా.. 

నిను విడుదల చేస్తాం రావయ్యా

రామయ్యా.. రామయ్యా..

లేవయ్యా.. లేవయ్యా..


హ్యాండ్సప్..


- పాటల ధనుస్సు

మసక మసక చీకటిలో | Masaka Masaka Cheekatilo | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

మసక మసక చీకటిలో



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం: రమేశ్ నాయుడు

గీతరచయిత: ఆరుద్ర

నేపధ్య గానం: ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:


మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మాపటేళకలుసుకో... 


నీ మనసైనది దొరుకుతుంది 

మనసైనది దొరుకుతుంది 

దొరుకుతుంది 


ఓకే... యా... యా యా... 

యయాయయాయా... 

యా యా... యయాయయాయా... హా... 


చరణం 1:


మా దేశం వచ్చినవాడా 

మా బొమ్మలు మెచ్చినవాడా 

మా దేశం వచ్చినవాడా 

మా బొమ్మలు మెచ్చినవాడా 


తరతరాల అందాల 

తరగని తొలి చందాల 

తరతరాల అందాల 

తరగని తొలి చందాల 

ఈ భంగిమ నచ్చిందా 

ఆనందం ఇచ్చిందా అయితే... ఏ ఏ... 


మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మాపటేళకలుసుకో... 

నీ మనసైనది దొరుకుతుంది 

మనసైనది దొరుకుతుంది 

దొరుకుతుంది 


ఓకే... యా... యా యా... 

యయాయయాయా... 

యా యా... యయాయయాయా... హా... 


చరణం 2:


చోద్యాలు వెతికేవాడా 

సొగసు చూసి మురిసేవాడా 

చోద్యాలు వెతికేవాడా 

సొగసు చూసి మురిసేవాడా 


కళ చేతికి దొరకాలంటే 

నలుమూలలు తిరగాల

కళ చేతికి దొరకాలంటే 

నలుమూలలు తిరగాల 

నీ ముందుకు రావాలా 

నీ సొంతం కావాలా అయితే... ఏ ఏ... 


మసక మసక చీకటిలో 

మల్లెతోట వెనకాల 

మాపటేళ కలుసుకో... 

నీ మనసైనది దొరుకుతుంది 

మనసైనది దొరుకుతుంది 

దొరుకుతుంది 


ఓకే... యా... యా యా... 

యయాయయాయా... 

యా యా... యయాయయాయా... హా...


- పాటల ధనుస్సు

18, సెప్టెంబర్ 2024, బుధవారం

విన్నారా అలనాటి వేణుగానం | Vinnara Alanati Venuganam | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

విన్నారా అలనాటి వేణుగానం 



చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


సాకి  :


మరల రేపల్లెవాడలో.. మురళి మోగె

మోడువారిన హృదయాలు పూయసాగె.. 


పల్లవి :


విన్నారా..  విన్నారా..

అలనాటి వేణుగానం మోగిందె మరల.. 

అలనాటి వేణుగానం మోగిందె మరల

చెలరేగే మురళీ సుధలు.. 

తలపించును కృష్ణుని కథలు..  

విన్నారా 


చరణం 1 :


పుట్టింది ఎంతో గొప్పవంశం.. 

పెరిగింది ఏదో మరో లోకం

పుట్టింది ఎంతో గొప్పవంశం..  

పెరిగింది ఏదో మరో లోకం


అడుగడుగున గండాలైనా 

ఎదురీది బతికాడు

అడుగడుగున గండాలైనా 

ఎదురీది బతికాడు

చిలిపి చిలిపి దొంగతనాలు 

చిననాడే మరిగాడు


దొంగైనా.. దొర అయినా.. 

మనసే హరించేనులే    

 

విన్నారా.. అలనాటి వేణుగానం 

మోగిందె మరల

అలనాటి వేణుగానం.. 

మోగిందె మరల


చరణం 2 :  


ద్వేషించే కూటమిలోన నిలచి..  

ప్రేమించే మనిషేకదా మనిషి

ద్వేషించే కూటమిలోన నిలచి..  

ప్రేమించే మనిషేకదా మనిషి


ఆడేది నాటకమైనా 

పరుల మేలు  తలచాడు

ఆడేది నాటకమైనా 

పరుల మేలు  తలచాడు

అందరికీ ఆనందాల 

బృందావని నిలిపాడు


ఆ నాడు..  ఈ నాడు 

మమతే తరించేనులే  


విన్నారా.. అలనాటి వేణుగానం 

మోగిందె మరల

చెలరేగే మురళీ సుధలు.. 

తలపించును కృష్ణుని కథలు..  

విన్నారా


- పాటల ధనుస్సు

17, జనవరి 2022, సోమవారం

దోర వయసు చిన్నది | Dora vayasu chinnadi | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

దోర వయసు చిన్నది



చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: బాలు, సుశీల

 

పల్లవి:

ఏయ్..

అబ్బో..

దోర వయసు చిన్నది.. లరలలహ

భలే జోరుగున్నది... లరలలహ

దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..

దోర వయసు చిన్నది.. లరలలహ.. అహా..

అహా..


చరణం 1:


ఏయ్.. ఒళ్ళు ఎలా ఉంది?

ఒళ్ళా?

ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...

ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే

ఒళ్ళు ఝల్లుమంటుంది నిన్ను చూస్తే...

ఏదోలా ఉంటుందీ నిన్ను తాకితే

 ఊఁహూఁ.. ఉంటది.. ఒక్కటిస్తే.. గూబ గుయ్... అంటది

ఒక్కటిచ్చి ఒక్కసారి నీ వాణ్ణి చేసికో

ఎన్నటికీ మరువలేని ఎన్నో సుఖాలందుకో..

ఛీ..పో..

అబ్బో..

దోర వయసు చిన్నది.. లరలలహ

భలే జోరుగున్నది... లరలలహ

దీని తస్సాదియ్యా కస్సుమంటున్నది కవ్విస్తూ ఉన్నదీ..


దోర వయసు చిన్నది.. లరల..

అహా.. అహా.. ఒహో..


చరణం 2:


ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే

చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే

ఒళ్ళు మండిపోతోంది నిన్ను చూస్తే

చెంప చెళ్ళు మంటుందీ హద్దు మీరితే

అహాఁ.. అలాగా?

అలాగిలా అనుకోకు అందరిలా నన్నూ

చెఢామఢా పేలావో చెరిగేస్తా చూడు

అబ్బో...


 - పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు