RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
vinnara alanati venuganam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
vinnara alanati venuganam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, సెప్టెంబర్ 2024, బుధవారం

విన్నారా అలనాటి వేణుగానం | Vinnara Alanati Venuganam | Song Lyrics | Devudu Chesina Manushulu (1973)

విన్నారా అలనాటి వేణుగానం 



చిత్రం : దేవుడు చేసిన మనుషులు (1973)

సంగీతం : రమేశ్ నాయుడు

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


సాకి  :


మరల రేపల్లెవాడలో.. మురళి మోగె

మోడువారిన హృదయాలు పూయసాగె.. 


పల్లవి :


విన్నారా..  విన్నారా..

అలనాటి వేణుగానం మోగిందె మరల.. 

అలనాటి వేణుగానం మోగిందె మరల

చెలరేగే మురళీ సుధలు.. 

తలపించును కృష్ణుని కథలు..  

విన్నారా 


చరణం 1 :


పుట్టింది ఎంతో గొప్పవంశం.. 

పెరిగింది ఏదో మరో లోకం

పుట్టింది ఎంతో గొప్పవంశం..  

పెరిగింది ఏదో మరో లోకం


అడుగడుగున గండాలైనా 

ఎదురీది బతికాడు

అడుగడుగున గండాలైనా 

ఎదురీది బతికాడు

చిలిపి చిలిపి దొంగతనాలు 

చిననాడే మరిగాడు


దొంగైనా.. దొర అయినా.. 

మనసే హరించేనులే    

 

విన్నారా.. అలనాటి వేణుగానం 

మోగిందె మరల

అలనాటి వేణుగానం.. 

మోగిందె మరల


చరణం 2 :  


ద్వేషించే కూటమిలోన నిలచి..  

ప్రేమించే మనిషేకదా మనిషి

ద్వేషించే కూటమిలోన నిలచి..  

ప్రేమించే మనిషేకదా మనిషి


ఆడేది నాటకమైనా 

పరుల మేలు  తలచాడు

ఆడేది నాటకమైనా 

పరుల మేలు  తలచాడు

అందరికీ ఆనందాల 

బృందావని నిలిపాడు


ఆ నాడు..  ఈ నాడు 

మమతే తరించేనులే  


విన్నారా.. అలనాటి వేణుగానం 

మోగిందె మరల

చెలరేగే మురళీ సుధలు.. 

తలపించును కృష్ణుని కథలు..  

విన్నారా


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు