RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
tulasi movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
tulasi movie లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, అక్టోబర్ 2026, శుక్రవారం

కలికి ముత్యాల కొలికి | Kaliki Mutyala Koliki | Song Lyrics | Tulasi (1974)

కలికి ముత్యాల కొలికి 


చిత్రం: తులసి (1974)

సంగీతం: ఘంటసాల

సాహిత్యం: సి. నారాయణ రెడ్డి

గానం: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి


పల్లవి:


కలికి ముత్యాల కొలికి.. 

పడకమ్మ ఉలికి ఉలికి...

కలికి ముత్యాల కొలికి.. 

పడకమ్మ ఉలికి ఉలికి...


ఆడబిడ్దంటే అర్ధమొగుడని 

అన్నావే... ఏ..ఏ..

మరి తీరా వస్తే... 

చల్లగా జారుకున్నావే..


మాట వరసకు 

అన్నాను గానీ ఓయమ్మో...

నువు అన్నంత 

చేస్తావనుకోలేదే గున్నమ్మో...

కలికి ముత్యాల కొలికి.. 

పడకమ్మ ఉలికి ఉలికి...


చరణం: 1


కోటేరు ముక్కుంది... 

కోటంత ఎత్తుంది...

మీసమంటు లేదు గానీ... 

పౌరుషం భలేగుందీ...

అందుకే నిను మెచ్చాను... 

ఒంటిగా ఇటు వచ్చాను...

హరి హరి నారాయణా... 

చచ్చాను... బాబోయ్ చచ్చాను...


కలికి ముత్యాల కొలికి... 

పడకమ్మ ఉలికి ఉలికి...

కలికి ముత్యాల కొలికి... 

రాకమ్మ ఉరికి ఉరికి..


చరణం: 2


ఆనాడు రాధగా 

నీ మేను తాకగా...

నిలువెల్ల కలిగింది 

గిలిగింత వెచ్చగా...

నిదరే రాదాయే....

గుండెలో బాధాయే...

శివ శివ ... నీ వాలకం 

శృతిమించిపోయే....

మించిపోయే...


కలికి ముత్యాల కొలికి...

పడకమ్మ ఉలికి ఉలికి...

ఆడబిడ్దంటే అర్ధమొగుడని 

అన్నావే...ఏ..ఏ..

మరి తీరా వస్తే...

చల్లగా జారుకున్నావే ...


మాటవరసకు 

అన్నాను కానీ ఓయమ్మో...ఓ...

నువు అన్నంత 

చేస్తావనుకోలేదు గున్నమ్మో...


కలికి ముత్యాల కొలికి...

పడకమ్మ ఉలికి ఉలికి...

పడకమ్మ ఉలికి ఉలికి....

రాకమ్మ ఉరికి ఉరికి...


- పాటల ధనుస్సు


లాలీ నా కన్నా జోజో నా చిన్నా | Lalee Naakanna Jojo | Song Lyrics | Tulasi (1974)

లాలీ నా కన్నా జోజో నా చిన్నా 


చిత్రం: తులసి (1974)

సంగీతం: ఘంటసాల

సాహిత్యం: దాశరథి 

గానం: పి.సుశీల


పల్లవి:


లాలీ నా కన్నా..

జోజో నా చిన్నా

జాబిల్లి జోల పాడాలీ..

కలలందు నీవు చేరాలి


చరణం: 1


చీకటి ఇంట వెన్నెలపంట..

పండేనోయి ఈరేయీ

ఎన్ని ఆశలో నాలో..

కన్నెకలువలై విరిసాయి


లాలీ నా కన్నా..

జోజో నా చిన్నా

జాబిల్లి జోల పాడాలీ..

కలలందు నీవు చేరాలి


చరణం: 2


నీవూ నేను నాన్నకు ప్రాణం..

దీవించేనూ మనకోసం

నీవూ నేను నాన్నకు ప్రాణం..

దీవించేనూ మనకోసం

పెరిగి పెద్దవై నీవే..

తోడు నీడగా నిలవాలి


లాలీ నా కన్నా..

జోజో నా చిన్నా

జాబిల్లి జోల పాడాలీ..

కలలందు నీవు చేరాలి


- పాటల ధనుస్సు


27, మే 2024, సోమవారం

సెలయేటి గలగలా చిరుగాలి కిలకిల | Selayeti Gala Gala | Song Lyrics | Tulasi (1974)

సెలయేటి గలగలా చిరుగాలి కిలకిల



చిత్రం : తులసి (1974)

రచన : ఆరుద్ర,

సంగీతం : ఘంటసాల,

గానం : బాలు సుశీల 


పల్లవి : 


సెలయేటి గలగల ఆ చిరుగాలి కిలకిల ఆ

సెలయేటి గలగల చిరుగాలి కిలకిల

సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిలా

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా


చరణం 1:


చందమామ కన్న నీ చెలిమి చల్లన

సన్నజాజి కన్న నీ మనసు తెల్లనా

నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా ఆఆ

నిన్ను కౌగిలించ గుండే ఝల్లనా 

నిలువెల్ల పులకించె మెల్లమెల్లనా


సెలయేటి గలగల ఆ చిరుగాలి కిలకిల ఆ

సెలయేటి గలగల చిరుగాలి కిలకిల

సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా


చరణం 2:


పసి నిమ్మపండు కన్న నీవు పచ్చనా

ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చనా

అనురాగం ఏదేదో అమరభావనా ఆ

అనురాగం ఏదేదో అమరభావనా ఆ 

అది నీవు దయచేసిన గొప్ప దీవెనా


సెలయేటి గలగల ఆ చిరుగాలి కిలకిలఆ

సెలయేటి గలగల చిరుగాలి కిలకిల

సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా

చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతలా


- పాటల ధనుస్సు  


పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు