ఏమిటో నీ మాయ
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : పింగళి నాగేంద్రరావు
నేపధ్య గానం : పి. లీల
పల్లవి:
ఏమిటో నీ మాయ..
ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ...
చరణం 1:
వినుటయే కాని వెన్నెల మహిమలు...
వినుటయే కాని వెన్నెల మహిమలు...
అనుభవించి నే నెరుగనయా..
అనుభవించి నే నెరుగనయా..
నీలో వెలసిన కళలూ కాంతులు ..
నీలో వెలసిన కళలూ కాంతులు...
లీలగా ఇపుడే కనిపించెనయా..
ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ...
చరణం 2:
కనుల కలికమిది నీ కిరణములే..
కనుల కలికమిది నీ కిరణములే..
మనసును వెన్నగా చేసెనయా..
మనసును వెన్నగా చేసెనయా..
చెలిమి కోరుతూ యేవో పిలుపులు..
చెలిమి కోరుతూ యేవో పిలుపులు..
నాలో నాకే వినిపించెనయా ...
ఏమిటో నీ మాయ
ఓ చల్లని రాజా.. వెన్నెల రాజా
ఏమిటో నీ మాయ...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి